ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ | students rally in osmania university | Sakshi
Sakshi News home page

ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ

Feb 27 2016 12:42 PM | Updated on Nov 9 2018 4:51 PM

ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ - Sakshi

ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ

ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు శుక్రవారం భారీ ర్యాలీ తీశారు.

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు శుక్రవారం భారీ ర్యాలీ తీశారు. గ్రూప్2 పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ మెయిన్ లైబ్రరీ నుంచి ఎన్‌సీసీ గేట్ విద్యానగర్ వైపు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అలాగే గ్రూప్2 పరీక్ష తేదీ పొడిగించాలని, పరీక్ష పాత పద్దతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్వూ విధానం రద్దు చేయాలని, జేఎల్ అండ్ డీఎల్ ఉద్యోగాల క్రమబద్దీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement