బడ్జెట్ తో పేద ప్రజలకు పెద్ద పీట వేయాలని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కోరారు.
'పేద ప్రజలకు పెద్ద పీట వేయాలి'
Feb 22 2016 1:37 PM | Updated on Aug 20 2018 9:16 PM
హైదరాబాద్: బడ్జెట్ తో పేద ప్రజలకు పెద్ద పీట వేయాలని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఆమెక్కిడ సోమవారం మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని ఆమె స్పష్టం చేశారు. కేంద్రానికి సమాంతర దూరంలో ఉంటామన్నారు. ప్రజా సమస్యలపై కచ్చితంగా నిలదీస్తామన్నాను. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అన్నారు. మరో వైపు కేంద్రంలో చేరే అంశంపై కవిత ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.
Advertisement
Advertisement