పసిపిల్లల విక్రయాలపై విచారణ చేయండి: సీపీఐ | CPI Demands inquiry on infant's sales | Sakshi
Sakshi News home page

పసిపిల్లల విక్రయాలపై విచారణ చేయండి: సీపీఐ

Dec 31 2015 1:20 PM | Updated on Jun 1 2018 8:39 PM

ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసిపిల్లల విక్రయాలు, సెక్స్ రాకెట్ పై నిజ నిర్థారణ కమిటీని వేసి విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసిపిల్లల విక్రయాలు, సెక్స్ రాకెట్ వంటి వాటిపై నిజ నిర్థారణ కమిటీని వేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో పసిపిల్లలను విక్రయిస్తున్నట్లు సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. అంగట్లో శిశువులను విక్రయానికి ఉంచిన ఆస్పత్రుల నిర్వాహకులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకుమునుపు అధికారంలో ఉన్నప్పుడు ఇంకుడుగుంతలంటూ మోసం చేసిన చంద్రబాబు..ఇప్పుడేమో ఫారం పాండ్స్ పేరుతో రాయలసీమ ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి సాధించేందుకు చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవటం గానీ, పోరాటం చేయటం గానీ చేయటం లేదని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫియాతో కోట్లు గడించిన టీడీపీ నేతలు ఎన్నికల్లో చేసిన ఖర్చును ఇప్పటికే రాబట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement