విమానాశ్రయంలో 5 కిలోల బంగారం స్వాధీనం | 5 kgs Gold seized at Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో 5 కిలోల బంగారం స్వాధీనం

Dec 19 2015 8:27 PM | Updated on Sep 3 2017 2:15 PM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ (రంగారెడ్డి) : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన రెండు వేరు వేరు విమానాల్లో గుర్తుతెలియని వ్యక్తులు 5 కిలోల బంగారాన్ని వదిలివెళ్లారు. ఇది గుర్తించిన అధికారులు బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికుల జాబితాను సేకరించి సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా అనుమానాస్పద వ్యక్తుల గురించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement