
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 120వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం ఉదయం ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం, ములకలూరు వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర పున ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి గొల్లపాడు, ముప్పళ్ల వరకు పాదయాత్ర సాగుతుంది.
119వ రోజు ముగిసిన పాదయాత్ర
119వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సరావుపేటలో పాదయాత్రను ముగించారు. ఆయన ఇవాళ (శనివారం) 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కోమటినేనివారి పాలెం, గంగన్నపాలెం, ఇర్లపాడు, అమీన్ సాహెబ్ పాలెం, బసికాపురం, కెసానుపల్లి మీదగా నర్సరావుపేట వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1586.2 కిలోమీటర్లు నడిచారు.