బాబుకు గుణపాఠం తప్పదు

Devireddy Subramanyam Reddy Article On AP Politics - Sakshi

అభిప్రాయం

జనం సమస్యల్ని ఐడెంటిఫై చేయడం, వాటిని లోతుగా అవగాహన చేసుకోవడం, త్వరితంగా వాటిని పరిష్కరించడం లాంటి వాటితో రైతుకు రక్షణ, రైతుకూలీకి భద్రత, వృత్తిపని వారికి ఊరట, పేదలకు ధీమా, యువతకు భరోసా, మహిళలకు ప్రగతి, గిరిజనులకు కొండంత అండ, మైనారిటీలకు అభయం, చేనే తన్నకు చేయూతనిచ్చిన అభివృద్ధి–సంక్షేమ పథకాల్ని సంతృప్త స్థాయిలో అమలుపరచి సంతోషాంధ్రను నిర్మించినవాడు గత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఇదే రీతి ఆలోచనలు, లక్ష్యాలు వైఎస్‌ జగన్‌లోనూ ఉన్నాయని నమ్ముతున్న జనం ఆయనను కూడా వైఎస్సార్‌ను ఆదరించి, అభిమానించిన రీతిలోనే అభిమానిస్తున్నారు. అందుకే ఇతర పార్టీల ఓటర్లు, చిన్నా పెద్దా నాయకులు వెల్లువలా ఆయనవైపు వస్తున్నారు. 

కానీ, నేటి సీఎం చంద్రబాబు ఇలా ఆలోచించడానికి ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఆయన ఎన్ని సార్లు సీఎం అయినా జనం సమస్యలు తీరలేదు. ప్రజల జీవన పరిస్థితి మెరుగుపడలేదు. ఒకరకంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడల్లా అన్ని వర్గాలవారి బతుకులు దారుణంగా దిగజారిపోయాయి. అందుకు కారణం ఆయన ఆలోచనా ధోరణే. జనం ఎల్లప్పుడూ సమస్యల్లో ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష, ఫిలాసఫీ. జనం సమస్యల్లో ఉంటేనే తనవైపు దృష్టి పెడతారు, తను పెట్టే ఆశలకు, ప్రలోభాలకు లొంగుతారు. అంటే, జనానికి సమస్యలు ఉంటేనే వారిని నమ్మించి ఓట్లను పొందవచ్చు. అధికారంలో కొనసాగవచ్చు అనేదే ఆయన సిద్ధాంతం. అందుకే, జనం అవసరాల్ని ఎప్పుడూ పట్టించుకోడు.

పట్టించుకున్నట్లు కాగితాలపై చూపిస్తాడు. ఎన్నికలయ్యాక గత సీఎంలు జనానికి ఇచ్చినవాటితోపాటు, తను ఇచ్చినట్లు నటించిన వాటిని కూడా  తొలగించేస్తాడు లేదా కుదించేస్తాడు. అలాంటి నిర్వాకాల్లో రేషన్‌ కార్డులు ఏరివేయడాలు, పేదల పెన్షన్ల సంఖ్య తగ్గించడాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, రైతు రుణాలు ఎనభై ఏడు వేల కోట్లు ఇస్తానని చెప్పి పధ్నాలుగు వేల కోట్లు మాత్రమే ఇవ్వడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీని పూర్తిగా ఎగ్గొట్టడం, ఆర్టీసీ వంటి పలు సంస్థల్ని ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నించడం వంటివి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా జనానికి చెవిలో పూలు పెట్టి నమ్మక ద్రోహం చేస్తున్న ఆయన నిర్వాకాల్ని జానపదుల్లాగా నిత్యం జనం చెప్పుకోవడం రాష్ట్రమంతటా అగుపడుతోంది. 

వెన్నుపోట్లు, టోకరాలు, ప్రజలకు చెవిలో పువ్వులు– ఇదేగా నీ రాజ్యం చంద్రబాబూ. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచావు, తోడల్లుడి తోకకు నిప్పంటించి బయటకు గెంటివేశావు, తోడబుట్టిన వాడిని తరిమేశావు, బావమరుదుల్ని రాజకీయం బలితీశావు, నీదికాని పార్టీలో నిలువెత్తున పెరిగావు. మామ పెట్టిన పార్టీని మామకే లేకుండా చేశావు– ఇదేగా నీ రాజ్యం చంద్రబాబూ. తుపాకీ తూట్లు, వాటర్‌కేన్ల పోటు,్ల రైతు ఉద్యమకారులకు ఇక్కట్లు, రైతులకు ఆత్మహత్యలు, వ్యవసాయ కూలీలకు అగచాట్లు చంద్రబాబు పాలనలో మామూలైపోయాయి. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య నేరం కాబట్టి నష్టపరిహారం ఇవ్వను అన్నావు.

సారా వెల్లువలు, అప్పుల వరదలు, పరదేశీ డబ్ల్యూటీఓ వాకిట్లో అరవై వేల కోట్ల అప్పుకు గతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు, ప్రపంచ వాణిజ్య సంస్థకు సలాములు కొట్టే గులాములుగా తెలుగువారిని దిగజార్చడం– ఇదేగా నీ రాజ్యం బాబూ. రైతు, కార్మిక ఉద్యమాల్ని, మహిళా, విద్యార్థి ఉద్యమాల్ని నిర్దాక్షిణ్యంగా అణచేశావు. అసలు ప్రజా ఉద్యమాల్నే ఊసులేకుండా చేసేశావు. ప్రజల హక్కుల్ని కాలరాస్తావు. కోటి వరాలను కోతల వరాలుగా మార్చిన నీ మాటలను, చేతలను జనం ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. రోజుకో అబద్ధం, రోజుకో పార్టీతో మిత్రత్వం, ముసుగు లాలూచీ చేస్తుంటే జనం అర్థం చేసుకోలేని స్థితిలో లేరు. నీ నిజ స్వరూపాన్ని క్షుణ్ణంగా అర్థంచేసుకుని.. అన్ని పార్టీల్లోని ఓటర్లూ వైఎస్‌ జగన్‌ పక్షం చేరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఈ ఎన్నికల్లో నీకు గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారు.

వ్యాసకర్త : డా‘‘ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్రశాఖ,ఎస్వీయూ, తిరుపతి
సెల్‌ : 98495 84324

మరిన్ని వార్తలు

20-04-2019
Apr 20, 2019, 01:00 IST
ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రభావం సంగతి ఎలా ఉన్నా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని చిన్నారుల ఆకాంక్షలు కూడా...
20-04-2019
Apr 20, 2019, 00:57 IST
ఉల్లి ధరలు పెరిగిపోయి ప్రభుత్వాలు పడిపోయిన ఘటనల్ని చూశాం. వెల్లుల్లి రైతుల దీనావస్థ ఎన్నికల్లో ప్రచారం అంశంగా మారడమూ చూశాం....
20-04-2019
Apr 20, 2019, 00:48 IST
సార్వత్రిక ఎన్నికల చివరి దశలో పోలింగ్‌ జరుపుకోనున్న పంజాబ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప ఎన్నికల్లోనూ బీజేపీ–శిరోమణి అకాలీదళ్‌ను మట్టి...
20-04-2019
Apr 20, 2019, 00:48 IST
సార్వత్రిక ఎన్నికల చివరి దశలో పోలింగ్‌ జరుపుకోనున్న పంజాబ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప ఎన్నికల్లోనూ బీజేపీ–శిరోమణి అకాలీదళ్‌ను మట్టి...
20-04-2019
Apr 20, 2019, 00:14 IST
జీఎస్టీపై తూటాల్లా పేలే మాటలతో ‘మెర్సెల్‌’.. ఒక్క ఓటు కోసం వ్యవస్థపైనే తిరుగుబాటు చేసిన ‘సర్కార్‌’.. అంటరాని వసంతానికి తెర మీద జరిగిన...
20-04-2019
Apr 20, 2019, 00:08 IST
ఫేజ్‌–3హాట్‌ సీట్‌.:: నార్త్‌ గోవా దక్షిణ భారతంలో ఉన్న బుల్లి రాష్ట్రం గోవా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పర్యాటక కేంద్రం. 1961లో...
20-04-2019
Apr 20, 2019, 00:05 IST
పెద్ద బిడ్డ  విజయానికి  జైలు నుంచే వ్యూహం పాటలీపుత్రలో ఆర్జేడీ తరఫున పోటీచేసే అవకాశం 2014లో మీసాకు లభించింది. ఈ సీటు...
20-04-2019
Apr 20, 2019, 00:01 IST
అభిమానానికి అవధుల్లేనట్టే, వ్యతిరేకతలోనూ విపరీతం ఉంటుందని ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షా పార్లమెంటు స్థానంలో జరిగిన ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని...
19-04-2019
Apr 19, 2019, 21:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు చివరి అవకాశం ఇచ్చినట్లు ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి...
19-04-2019
Apr 19, 2019, 21:20 IST
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలొదిలిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ హేమంత్‌ కర్కర్‌పై బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్‌...
19-04-2019
Apr 19, 2019, 20:27 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, నరేంద్రమోదీ ప్రధానిగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
19-04-2019
Apr 19, 2019, 20:22 IST
సాక్షి, ముంబై: తమ నాయకత్వ  తప్పిదం కారణంగానే ప్రియాంక చతుర్వేది ​కాంగ్రెస్‌ పార్టీని వీడారని, ఈ పరిణామం పార్టీపై ప్రభావం చూపుతుందనే...
19-04-2019
Apr 19, 2019, 19:49 IST
సాక్షి, పెనుమూరు: చంద్రబాబు సీఎం కుర్చీపై పెట్టుకున్న ఆశలు వదులుకోవాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారాయణస్వామి...
19-04-2019
Apr 19, 2019, 19:27 IST
లక్నో: సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ రామ్‌చరిత్ర...
19-04-2019
Apr 19, 2019, 18:50 IST
విశాఖపట్నం: ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే రాష్ట్ర ఖజానాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖాళీ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేత...
19-04-2019
Apr 19, 2019, 18:40 IST
దేవెగౌడపై యడ్యూరప్ప ఫైర్‌
19-04-2019
Apr 19, 2019, 18:04 IST
లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను దీటుగా ఎదుర్కొంటానని లక్నోలో ఎస్పీ అభ్యర్ధిగా ఆయనతో తలపడుతున్న...
19-04-2019
Apr 19, 2019, 17:54 IST
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ...
19-04-2019
Apr 19, 2019, 17:13 IST
గుల్బర్గా: కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప విలేకరుల సమావేశంలో సహనం కోల్పోయి.. ఓ విలేకరిపై చిందులు తొక్కారు. గత...
19-04-2019
Apr 19, 2019, 16:16 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top