ఒక్కచోట ఇద్దరు... ఒకలా మాత్రం ఉండరు! | zee tv serial Sapne Suhane Kay ladakpan | Sakshi
Sakshi News home page

ఒక్కచోట ఇద్దరు... ఒకలా మాత్రం ఉండరు!

Published Sun, Sep 14 2014 1:15 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

ఒక్కచోట ఇద్దరు... ఒకలా మాత్రం ఉండరు! - Sakshi

ఇద్దరమ్మాయిలు. ఒకరు మహా ఫాస్టు. ఇంకొకరు మరీ మృదువు. ఒకామె పులిపిల్లలా విరుచుకుపడుతుంది. ఇంకొకామె కుక్కపిల్లను చూసినా భయంతో పరుగు పెడుతుంది. ఒకామె జలపాతంలా హుషారుగా ఉంటుంది. ఇంకొకామె మలయ పవనంలా ప్రశాంతంగా ఉంటుంది.

ఇలాంటి విభిన్నమైన మనస్తత్వాలు కల రచన, గుంజన్ అనే ఇద్దరమ్మాయిలను ఒక్కచోట చేర్చి తీసిందే ‘సప్నే సుహానే లడక్‌పన్ కే’. జీ టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ని అద్భుతమైన సీరియల్ అనడానికి లేదు. అలాగని చెత్తా అనలేం. పాత్రల చిత్రణ బాగుంటుంది. కథ మాత్రం కాస్త కాస్త విసిగిస్తూ ఉంటుంది. అయినా రెండేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుండటం విశేషమే!

Advertisement
 
Advertisement
 
Advertisement