టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్! | Shilpa shirodkar turns Serials with second innings | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్!

Dec 8 2013 3:36 AM | Updated on Sep 2 2017 1:22 AM

టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్!

టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్!

సినిమా చూస్తారా, సీరియల్ చూస్తారా అంటే... ఒక్క క్షణం కూడా తడుముకోకుండా సీరియల్ అంటున్నారు మహిళా మణులు. అందుకే చానెళ్లలో సినిమాలు రావడం కూడా తగ్గిపోయింది.

 సినిమా చూస్తారా, సీరియల్ చూస్తారా అంటే... ఒక్క క్షణం కూడా తడుముకోకుండా సీరియల్ అంటున్నారు మహిళా మణులు. అందుకే చానెళ్లలో సినిమాలు రావడం కూడా తగ్గిపోయింది. శని, ఆది వారాల్లో తప్ప మిగతా రోజుల్లో సీరియల్స్‌దే హవా. ఇటీవల కొత్తగా శనివారం కూడా ఇచ్చేస్తున్నారు. ముందు ముందు ఆదివారం కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 
 ఇంతగా సీరియళ్లు ఏలుతున్నాయి కాబట్టే... సినిమా వాళ్లు సయితం సీరియళ్ల మీద మోజు పడుతున్నారు. సినిమాల్లో చేస్తున్నవారు కాస్త హవా తగితే సీరియళ్లలోకి జంప్ చేస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కూడా అదే పని చేశారు. ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన ఈమె... ఇప్పుడు జీటీవీలో ప్రసారమయ్యే ‘ఎక్ ముఠ్ఠీమే ఆస్‌మాన్’ సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు.
 
 ఇంతకీ శిల్ప ఎవరో గుర్తుందిగా? ‘బ్రహ్మ’ చిత్రంలో మోహన్‌బాబుతో నటించారు. ‘ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన’ అంటూ ఆ సినిమాలో మోహన్‌బాబు పాట పాడేది ఈమె కోసమే. నమ్రతా శిరోద్కర్‌కి అక్క, మహేశ్‌బాబుకి వదిన అయిన శిల్ప... ఒకనాడు తన గ్లామర్‌తో యువకుల కలల రాణిగా వెలిగారు. ఇప్పుడు సీరియల్‌లో ఓ సాధారణ ఇల్లాలిగా నటనను పండిస్తూ... తెలుగు  ఇల్లాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మరి టీవీతో మొదలైన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్... ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement