కబాబ్‌లను కాల్చేస్తుంది... | Kebab of Igrill Mini in Smartphone | Sakshi
Sakshi News home page

కబాబ్‌లను కాల్చేస్తుంది...

Oct 9 2016 1:38 AM | Updated on Nov 6 2018 5:26 PM

కబాబ్‌లను కాల్చేస్తుంది... - Sakshi

కబాబ్‌లను కాల్చేస్తుంది...

కణకణలాడే నిప్పుల మీద కబాబ్‌లను కాల్చడం కాస్త కష్టసాధ్యమైన కళ. కొంచెం అటూ ఇటూ అయితే కబాబ్‌లు నల్లగా మాడిపోవడమో...

కణకణలాడే నిప్పుల మీద కబాబ్‌లను కాల్చడం కాస్త కష్టసాధ్యమైన కళ. కొంచెం అటూ ఇటూ అయితే కబాబ్‌లు నల్లగా మాడిపోవడమో, లేకుంటే కాలీ కాలకుండా తయారవడమో జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా స్మార్ట్‌గా కబాబ్‌లను కాల్చుకోవాలంటే, ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఐగ్రిల్ మినీ’ ఉండాల్సిందే. ఇది కూడా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. గ్రిల్ మీద కోరుకున్న పదార్థాన్ని కాల్చేటప్పుడు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీనికి తగిన ఆదేశాలిస్తే చాలు... చక్కగా కావాల్సిన రీతిలో కబాబ్‌లను కాల్చేస్తుంది.

ఉష్ణోగ్రత వివరాలను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటుంది. ఇందులో ఆరు రకాల టెంపరేచర్ ఆప్షన్లు ఉంటాయి. వీటిలో కావలసినది ఎంచుకుని, ఆ రీతిలో కబాబ్‌లను కాల్చుకోవచ్చు. అలా కాకుంటే, కోరుకున్న విధంగా టెంపరేచర్‌ను మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement