మచ్చలను పోగొట్టే మెరుపు

Funday beauty tips 17-03-2019 - Sakshi

మార్కెట్‌లో దొరికే ఫేస్‌ క్రీమ్స్‌ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావాల్సినవి : 
క్లీనప్‌ : ఆలివ్‌ నూనె – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్, నిమ్మరసం – 5 లేదా 6 చుక్కలు
 స్క్రబ్‌ : మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్, నీళ్లు – కొద్దిగా
మాస్క్‌:  తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పసుపు – చిటికెడు, గడ్డపెరుగు – పావు టీ స్పూన్, శనగపిండి – పావు టీ స్పూన్‌
తయారీ : ముందుగా ఆలివ్‌ నూనె, తేనె, నిమ్మరసం ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, సరిపడా నీళ్లు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, పసుపు, గడ్డపెరుగు, శనగపిండి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top