ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ కొంతమేర ఫలిస్తుంది. పనులలో అవరోధాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.
	మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
	 ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ కొంతమేర ఫలిస్తుంది. పనులలో అవరోధాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు ఒత్తిడులు. కళాకారులు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
	 
	 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
	 పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన వార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
	 
	 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
	 రావలసిన పైకం అందుతుంది. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. వివాదాలు.
	 
	 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
	 ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
	 
	 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
	 పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం  మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.
	 
	 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
	 కొత్తగా పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. జీవితాశయం నెరవేరే సమయం. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో అనారోగ్యం.
	 
	 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
	 పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.
	 
	 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
	 అవసరాలు తీరతాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. సోదరులు, మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అదనపు విధులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం.
	 
	 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
	 కొత్త పనులు ప్రారంభిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులకు సంతోషం కలిగిస్తుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. కళాకారులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
	 
	 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
	 పనులలో విజయం. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆశయాలు నెరవేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. సోదరుల నుంచి ధన లేదా ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. వారం ప్రారంభంలో ధనవ్యయం. వివాదాలు.
	 
	 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
	 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. భూములు, వాహనాలు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ప్రయాణాలు. అనారోగ్యం.
	 
	 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
	 
కొంత నిదానం అవసరం. పనులలో జాప్యం చికాకు పరుస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రం. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. పుణ్యక్షేత్రాల సందర్శనం.
	 
	 
	- సింహంభట్ల సుబ్బారావు,
	 జ్యోతిష పండితులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
