సల్మాన్... ప్రైస్‌లెస్! | salmankhan priceless! | Sakshi
Sakshi News home page

సల్మాన్... ప్రైస్‌లెస్!

Mar 9 2015 12:14 AM | Updated on Sep 2 2017 10:31 PM

సల్మాన్... ప్రైస్‌లెస్!

సల్మాన్... ప్రైస్‌లెస్!

ఇప్పటి వరకు మనకు షర్ట్‌లెస్ సల్మాన్‌ఖాన్ తెలుసు. కానీ అతడిలో మరో యాంగిల్ బయటకు తీసింది శ్రీలంక చిన్నది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

ఇప్పటి వరకు మనకు షర్ట్‌లెస్ సల్మాన్‌ఖాన్ తెలుసు. కానీ అతడిలో మరో యాంగిల్ బయటకు తీసింది శ్రీలంక చిన్నది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన సల్లూభాయ్ ప్రైస్‌లెస్ అంటూ ఆకాశానికెత్తేసింది. అవకాశాల కోసం ఆశగా ఎదురు చూసి చూసి నిరాశలో కూరుకుపోయిన సమయంలో సల్మాన్ తనకు ‘కిక్’ సినిమా ఇచ్చాడని, ఆ ఉపకారానికి వెల కట్టలేమని ఎంతో ఉద్వేగంగా చెబుతోంది. ‘ఏ సినిమా అయినా సరే చాన్స్ వస్తే చాలని పరితపిస్తున్న రోజులవి. ఒక టైమ్‌లో అసలు హోప్స్ వదిలేసుకున్నా. ఫీల్డ్‌కు గుడ్‌బై చెబుదామా అన్న ఆలోచనా వచ్చింది.
 
 ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్, సాజిద్ నదియావాలా ఆఫర్ ఇచ్చి ఆదుకున్నారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిది’ అంటూ అంతరాంగాన్ని ఆవిష్కరించింది జాక్వెలిన్. ఏదిఏమైనా... ‘కిక్’ అమ్మడికి డబుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. కెరీర్‌కు ఓ సూపర్ హిట్ టర్నింగ్ పాయింట్‌తో పాటు, సల్మాన్‌తో డేటింగ్‌షిప్! లక్కంటే అదే మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement