ఆకాశమంత.. | puri jagannath son talks about relationship with his sister | Sakshi
Sakshi News home page

ఆకాశమంత..

Aug 10 2014 1:02 AM | Updated on Mar 22 2019 1:53 PM

ఆకాశమంత.. - Sakshi

ఆకాశమంత..

నా ధైర్యం నా చెల్లెలే అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నంటే నాకు ప్రాణం అంటోంది పూరీ తనయ పవిత్ర. ఆకాశ్ ఇంటర్, పవిత్ర టెన్త్ చదువుతున్నారు.

నా ధైర్యం నా చెల్లెలే అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నంటే నాకు ప్రాణం అంటోంది పూరీ తనయ పవిత్ర. ఆకాశ్ ఇంటర్, పవిత్ర టెన్త్ చదువుతున్నారు. తండ్రికి జిరాక్స్ కాపీలా ఉండే చెల్లికి కాస్త మేకప్ చేసి.. నాన్నలా ముస్తాబు చేయడం ఆ అన్నకు సరదా. అన్నయ్యకు సర్‌ప్రైజ్ లు ఇవ్వడం చెల్లికి మహా సరదా. లాస్ట్ ఇయర్ ఆకాశ్ బర్త్‌డేకి రేర్ ఫొటోగ్రాఫ్స్‌తో ఏవీ ప్రిపేర్ చేసి కానుకగా ఇచ్చింది. 

ఇద్దరిలో చెల్లెలిదే డామినేషన్. ‘అన్నయ్యకు కోపం వస్తే బొమ్మలు గాల్లో తేలుతాయి. అప్పుడు ఎవరేం చెప్పినా వినడు. అన్నయ్యను ఎవరేం అన్నా నేను ఊరుకోను’ అంటోంది పవిత్ర. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఓనమాలు దిద్దుతున్న చెల్లిని ప్రోత్సహించడం ఒక్కటే ఆ అన్నయ్యకు తెలుసు. ‘నేను డిజైన్ చేసిన షర్ట్స్‌ను మెచ్చుకోవడమే కానీ.. బాగోలేదని ఎప్పుడూ చెప్పడు. సలహాలు ఇస్తుంటాడు’ అని పవిత్ర కాస్త గర్వంగా చెబుతుంటుంది.

‘రాఖీ రోజు అన్నయ్య  నాకిష్టమైన బహుమతి ఇస్తాడు. రాఖీకి అన్నయ్య ప్రజెంట్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ అమ్మను కూడా ముట్టుకోనివ్వన’ని చె ప్పుకొచ్చింది. ఈ రాఖీ పండుగకు..  చెల్లికి పర్షియన్ క్యాట్ ఇవ్వబోతున్నానని ఆకాశ్ రహస్యంగా చెప్పాడు.  తను హీరో అవ్వాలని కోరుకుంటున్న ఆకాశ్.. చెల్లెలు డెరైక్టర్‌గా రాణించగలద ని నమ్మకంగా చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement