నిక్ నేమ్! | nick name | Sakshi
Sakshi News home page

నిక్ నేమ్!

Mar 10 2015 1:36 AM | Updated on Sep 2 2017 10:33 PM

మెగాస్టార్‌గా ఎదిగినా ఆ దర్పం ఎక్కడా కనపడనివ్వడు అమితాబ్‌బచ్చన్.

మెగాస్టార్‌గా ఎదిగినా ఆ దర్పం ఎక్కడా కనపడనివ్వడు అమితాబ్‌బచ్చన్. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా సెట్స్‌లో ఎవరితోనైనా భేషజం లేకుండా ఇట్టే కలసిపోతాడు. సరదాగా కబుర్లు చెబుతాడు. తాజాగా స్టార్ హీరోయిన్ దీపికాపడుకొనేతో అమితాబ్ చేస్తున్న చిత్రం ‘పికూ’ షూటింగ్ ఉత్సాహంగా సాగుతోందట. తన కుమార్తెగా నటిస్తున్న దీపికకు అమితాబ్ ఓ ముద్దు పేరు పెట్టాడట... ‘దీపికు’ అని! అటు అమ్మడి పేరు... ఇటు సినిమా టైటిల్ మిక్స్ చేసేసిన బిగ్ బీ... సెట్స్‌లో కూడా ‘దీపికు’ అనే పిలుస్తున్నాడట! అలా కొత్తగా పిలుస్తున్నా దీపిక కూడా నో చెప్పలేదనేది హిందుస్థాన్ టైమ్స్ కథనం. ఇప్పటి వరకూ తనను ఎవరూ ఇలా పిలవకపోయినా... అమితాబ్ కాబట్టి పలుకుతోంది ఈ పొడుగు కాళ్ల సుందరి! సరదాగా ఎంజాయ్ చేస్తోంది కూడానట! నైస్ ‘దీపికు’!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement