‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంకా చోప్రా సరసన ఆదర్శభర్త పాత్రలో మెప్పించిన దర్శన్‌కుమార్
‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంకా చోప్రా సరసన ఆదర్శభర్త పాత్రలో మెప్పించిన దర్శన్‌కుమార్, తన తాజా చిత్రం ఎన్‌హెచ్-10లో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ అనుష్క శర్మను దారుణంగా హింసించే శాడిస్టు పాత్రలో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్‌హెచ్-10లో తన పాత్ర ప్రతి మహిళకు ఓ పీడకల మాదిరిగా ఉంటుందని దర్శన్ చెబుతున్నాడు.