వీకెండ్ పాదచారులు | Meetings with foreign weekends | Sakshi
Sakshi News home page

వీకెండ్ పాదచారులు

Nov 25 2014 11:20 PM | Updated on Oct 4 2018 7:01 PM

వీకెండ్ పాదచారులు - Sakshi

వీకెండ్ పాదచారులు

వారంతా వారాంతపు పాదచారులు. నగరంలో నడకపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది గానీ, పాతికేళ్లుగా వారంతా వారాంతాల్లో క్రమం తప్పకుండా కలసి నడుస్తూనే ఉన్నారు.

వారంతా వారాంతపు పాదచారులు. నగరంలో నడకపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది గానీ, పాతికేళ్లుగా వారంతా వారాంతాల్లో క్రమం తప్పకుండా కలసి నడుస్తూనే ఉన్నారు. నడకపై మక్కువ ఉన్నవారంతా కలసి ‘హ్యాషర్స్ వాక్’ పేరిట క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఈ క్లబ్ రజతోత్సవం జరుపుకోబోతోంది. నగరంలో ఉంటున్న విదేశీయులతో వారాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం, కనీసం ఆరు కిలోమీటర్లు నడక సాగించడం, ఆటపాటలు, విందు వినోదాలతో కాలక్షేపం చేయడం ఈ క్లబ్ ప్రధాన కార్యకలాపాలు.

నడక సాగించే బృందానికి నాయకత్వం వహించే ఇద్దరిని ‘హేర్స్’ అంటారు. వీరు ఆకుపచ్చ చొక్కాలు ధరిస్తారు. ప్రతి ఆదివారం వీరంతా సాయంత్రం వేళల్లో కలుసుకుంటారు. నగరంలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వారంతా ఈ సమావేశాలకు హాజరవుతుంటారు. వీరిలో అమెరికా, చైనా సహా పలు దేశాలకు చెందిన నలభై మంది వరకు సభ్యులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ బృందం సందర్శించిన అన్ని ప్రదేశాల వివరాలను ఒక రికార్డు బుక్‌లో నమోదు చేసుకుంటారు.

సిద్ధాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement