లవ్ ట్రీట్స్ | love treats | Sakshi
Sakshi News home page

లవ్ ట్రీట్స్

Mar 10 2015 1:15 AM | Updated on Sep 2 2017 10:33 PM

ప్రసాద్ ఫ్రమ్ నెల్లూరు.. ప్రత్యూష ఫ్రమ్ పశ్చిమ గోదావరి అయినా పెరిగింది మాత్రం చెన్నైలో.

 ఈ మాట ఈ ఇద్దరి కోసమేనేమో!
 ఆ ఇద్దరూ ప్రసాద్, ప్రత్యూష.
 ప్రసాద్ ఫ్రమ్ నెల్లూరు.. ప్రత్యూష ఫ్రమ్ పశ్చిమ గోదావరి అయినా పెరిగింది మాత్రం చెన్నైలో. హాస్టల్ నుంచి చెన్నై డెంటల్ కాలేజ్‌కి బస్‌లో వెళ్తుంటే వీరిద్దరికి పరిచయం. కొన్నాళ్లకే అది స్నేహంగా మారింది. ఎంతలా అంటే.. ఆ టైమ్‌లోనే ప్రత్యూష వాళ్ల నాన్నగారు చనిపోవడంతో ఆమెకు ఓదార్పు, సాంత్వన, అండ అన్నీ ప్రసాదే అయ్యారు. దాంతో ఆ స్నేహం ఎంత గాఢమైందంటే.. చివరకు ప్రత్యూషకు ప్రసాదే లోకం, ప్రసాద్‌కూ ప్రత్యూషే ప్రయారిటీ అనేంతగా! అందుకే ప్రసాద్ అంటుంటారు సరదాగా ‘అసలు బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్‌చేసినట్టుగానే లేదు.. ఫ్రెండ్స్, సరదాలు అన్నీ మిస్ అయినట్టుగా అనిపిస్తాయి’ అని. ‘నిజమే మరి.. ఎందుకంటే బీడీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎమ్‌డీఎస్.. టిల్ టు డే కలిసే ఉన్నాం!’ అంటారు ప్రత్యూష. ఎమ్‌డీఎస్ సెకండియర్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే.  ‘మా పెళ్లికి టూ డేసే లీవ్ ఇచ్చారు మా ప్రిన్స్‌పల్. ఇలా పెళ్లి చేసుకొని అలా కాలేజ్‌కి వెళ్లిపోయాం’ ఆ రోజుని గుర్తుచేసుకున్నారు ప్రత్యూష.
 పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్..
 ‘నిజానికి నాకు ఈ ప్రొఫెషన్ కన్నా బిజినెస్ అంటేనే ఇష్టం. ఆ ప్రయత్నమూ చేసి మళ్లీ ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చాను. అంటే ఈ వృత్తి అంటే ఆసక్తి లేదని కాదు.. చాలా ఇంట్రెస్ట్. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటుంటాను.. అయితే పెషంట్‌మీద పెర్‌ఫార్మ్ చేయడం ఇష్టం ఉండదు. అంటే ఈ వృత్తికి డెడికేషన్ చాలా ఉండాలి’ అని ప్రసాద్ అంటుంటే ‘పేషంట్స్ కూడా ఆయన్ని ట్రీట్‌చేసే తీరుని చాలా ఇష్టపడ్తార’ని ఆ టాపిక్‌ని పూర్తిచేస్తూ ‘నాకు టీచింగ్ అంటే ఇష్టం. కాలేజెస్‌లో క్లాసెస్ తీసుకుంటాను. నేను చెప్పబోయే సబ్జెక్ట్‌కి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేసిపెడ్తాడు. టెక్నికల్‌గా నేను వీక్. ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ చేస్తాడు’ అని ఆమె వివరిస్తే ‘పీఆర్‌లో నేను వీక్. దానికి సంబంధించిన వ్యవహారమంతా ప్రత్యూష చూసుకుంటుంది’ అని ఆమె అందిస్తున్న సహకారాన్ని ఆయన చెప్పారు.
 ప్లస్.. మైనస్
 ‘పంక్చువాలిటీ విషయంలో తను  చాలా లేజీ’అంటారు ప్రసాద్. ‘నేను అరగంట ముందుంటే తను గంట లేట్. పేషంట్స్ మనకోసం ఎదురుచూడొద్దు’ అని వివరణ ఇచ్చారు. ‘రావడం లేట్ అయినా డ్యూటీ ముగించుకోవడానికి తొందరపడను’ ప్రత్యూష సమాధానం. ‘ఆ టైంలో గొడవేం ఉండదు కానీ కోపమొస్తుంది’ అని ప్రసాద్ అంటుంటే ‘క్లాస్ తీసుకుంటాడు’ అని పక్కనుంచి ప్రత్యూష. ‘అందుకే మా అబ్బాయికి ఇప్పటి నుంచే పంక్చువల్‌గా ఉండడం నేర్పుతున్నా’ అని చెప్తారు ప్రసాద్. ‘ఎవరికి కోపమొచ్చినా మాట్లాడకుండా పక్కకి వెళ్లిపోతాం. అదీ అయిదుపది నిమిషాలే. మళ్లీ మామూలైపోతాం’ ప్రత్యూష. మరి ప్లస్ గురించి? ‘షి వోంట్ బాదర్ ఎబౌట్ ఫైనాన్స్ అండ్ షి వోంట్ ఇంటర్‌ఫియర్ ఇన్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్’అని ప్రసాద్ అంటుంటే ‘నాకేం కావాలో అన్నీ తనే చూసుకుంటుంటారు.. ఆ బర్డెన్ మోసే చాన్సే ఇవ్వరు. దేని గురించీ ప్రెషర్‌గా ఫీలయ్యేలా చేయడు. ఫైనాన్షియల్‌గా అంత స్ట్రాంగ్‌గా లేని రోజుల్లో కూడా దుబాయ్‌లాంటి చోట 875 రూపాయలు పెట్టి తనకు నాకు కాఫీ కొనిచ్చిన రోజులూ ఉన్నాయి. ఉదయం లేవగానే నాకు కాఫీ లేకపోతే కుదరదు. తనకసలు కాఫీ, టీలు అలవాటే లేదు. అలా నాకు ఇష్టమైనవాటి కోసం ఎంత కష్టమైనా కాంప్రమైజ్‌కాడు’ అంటూ భర్తకు కాంప్లిమెంట్ ఇస్తారు ప్రత్యూష. ‘తను ఈ గాడ్జెట్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు. నాకేమో చాలా ఇష్టం. నేను ఏ ఫోన్ గురించయినా వాకబు చేసినట్టుగా, ఓ అయిదు నిమిషాలు దాన్ని చూసినా తెల్లారే సరికల్లా ఆ ఫోన్ నా టేబుల్ మీద పెడుతుంది’ ప్రత్యూష మనసుకు తన మాటలు అద్దారు ప్రసాద్. ‘నేను ఈ రోజు వరకే ఆలోచిస్తే.. తన ప్లాన్ పదేళ్ల వరకు ఉంటుంది’ అని భర్త ముందుచూపు మెచ్చుకుంటారు ప్రత్యూష.
 
 
 
 
 ఒకరికి ఒకరు..
 ‘మోర్ దన్ మై పేరెంట్స్. ఎందుకంటే మా అమ్మానాన్నతో నేనున్నది ఎయిటీన్ ఇయర్సే. 20 ఏళ్లుగా.. ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసే ఉంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే షీ ఈజ్ ఎవ్రీ థింగ్ టు మీ’అంటూ తన జీవితంలో ప్రత్యూష పాత్రను చెప్తారు ప్రస్తాద్. ‘ఫ్రెండ్.. గైడ్.. ఫిలాసఫర్.. ప్రొటెక్టర్.. ఎవ్రీథింగ్’ ప్రత్యూషదీ అదే ఆప్యాయత ప్రసాద్‌పట్ల! ‘మామధ్య అభిప్రాయబేధాలు ఉండవని కాదు.. కానీ అవేవీ మాధ్య అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్‌ని తీసుకురాలేదు. ఇంకా చెప్పాలంటే అవగాహనను పెంచాయి’ అంటారు ప్రత్యూష. ‘భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటాం. వి నో ఈచ్ అదర్ వెరీవెల్’ అంటూ హ్యాపీమ్యారీడ్‌లైఫ్ సీక్రెట్ చెప్పారు ప్రసాద్.
 ..:: సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement