లేడీసే లీడర్స్ | Ledise Leaders | Sakshi
Sakshi News home page

లేడీసే లీడర్స్

Apr 26 2015 3:04 AM | Updated on Sep 3 2017 12:52 AM

లేడీసే లీడర్స్

లేడీసే లీడర్స్

యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్.. యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ...

యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్.. యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, వారి సాధికారతకు కృషి చేస్తున్న సంస్థ. దశాబ్దానికి పైగా నగరంలో సేవలందిస్తున్న ఎఫ్‌ఎల్‌ఓ (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్)కు అనుబంధంగా నడుస్తోందీ వైఎఫ్‌ఎల్‌ఓ. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, అవేర్‌నెస్, ట్రైనింగ్, బిజినెస్ కన్సల్టెన్సీ, నెట్‌వర్కింగ్ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు యంగ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను అప్‌డేట్ చేస్తూ... వారి అభివృద్ధికి చేయూతనందిస్తోంది. దీనికి నూతన చైర్‌పర్సన్‌గా సామియా అలమ్‌ఖాన్ నియమితులయ్యారు. సిటీకి చెందిన ఈ
 యువ పారిశ్రామికవేత్త మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్. బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించి, ఐటీఈఎస్, కేపీఓ సెక్టార్స్‌లో ప్రభావవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుతం లీడింగ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ‘ఆరాయిష్’ పార్ట్‌నర్‌గా, ‘ది హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫాక్యక్టరీ’ డెరైక్టర్‌గా సమర్థవంతమైన పాత్రలు పోషిస్తున్న సామియా... శకుంతల దివి నుంచి ‘వైఎఫ్‌ఎల్‌ఓ’ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా... జీవితంలోని  ప్రతి అంకంలో మహిళ నాయకురాలే అంటారామె.
 
‘మహిళ సాధికారత సాధించాలంటే విద్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించడం కీలకం. అన్ని స్థాయిల్లో విద్య, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా దీన్ని సాకారం చేసుకోగలం. కాన్ఫిడెన్స్, ఎంపవర్‌మెంట్... కజిన్స్. దానికి మూలం, ప్రోత్సాహం ఆత్మవిశ్వా
 సమే. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ శక్తిగా ఎదుగుతోంది. మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
 
ఆలోచనలు విస్తృతం చేసి, ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకు పోయేలా ఎదగాలి. అది విద్య, మౌళిక వసతులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, వ్యాపారాలు.. ఏవైనా కావచ్చు’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు సామియా. వయసులో చిన్నే అయినా ఆమె ఆలోచనలు ఆకాశమంత. సీఈఓ నుంచి హౌస్‌వైఫ్ వరకు.. మహిళలు వంటింట్లో ఉన్నా.. వ్యాపార రంగంలో ఎదుగుతున్నా.. ఎక్కడున్నా నాయకురాళ్లే అనేది సామియా అలమ్‌ఖాన్ చెప్పే భాష్యం. అంతే కాదు... ‘ఏ గొప్ప కార్యం జరిగినా దానికి ఆరంభం మహిళలతోనే. విశ్వాసం, నాయకత్వ లక్షణాలున్న ఎంతో మంది స్త్రీల సామర్థ్యంతో ఈ భారతావని నిర్మితమైంది’ అంటూ స్ఫూర్తిదాయకంగా చెప్పుకొచ్చారు ఈ యువ పారిశ్రామికవేత్త. మహిళలు స్వతంత్రంగా ఎదిగి తోటి మహిళలకూ చేయూతనందించడం తప్పనిసరంటున్న సామియా ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు. ‘లెర్న్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్‌స్పైర్’ అనే థీమ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానంటున్నారామె.   సో... బెస్ట్ ఆఫ్ లక్ టు  సామియా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement