పెళ్లిళ్ల సీజన్‌లో విస్తృత శ్రేణి సంప్రదాయ ఆభారణాలను నగరవాసుల ముందుకు తెస్తోంది. ‘హైదరాబాద్ బ్రైడల్ జ్యువెలరీ వీక్ 2015’.
పెళ్లిళ్ల సీజన్‌లో విస్తృత శ్రేణి సంప్రదాయ ఆభారణాలను నగరవాసుల ముందుకు తెస్తోంది ‘హైదరాబాద్ బ్రైడల్ జ్యువెలరీ వీక్ 2015’. నగరంలో తొలిసారిగా మే 23, 24 తేదీల్లో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను సోమవారం ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కర్టెన్‌రైజర్‌లో మోడల్ అనుకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొంత మంది మోడల్స్ విభిన్న ఆభరణాలు ధరించి సంప్రదాయ సిరులు ఒలికించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ వీక్ ఇదే వేదికపై జరుగుతుంది.