విలక్షణ నట దర్శకుడు అమోల్ పాలేకర్ ‘సెలైన్స్’ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన ఢిల్లీ కళాభిమానులకు కనువిందు చేస్తోంది.
విలక్షణ నట దర్శకుడు అమోల్ పాలేకర్ ‘సెలైన్స్’ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన ఢిల్లీ కళాభిమానులకు కనువిందు చేస్తోంది. సినీరంగానికి రాక ముందు అమోల్ చిత్రకారుడిగానే కెరీర్ ప్రారంభించాడు. సినిమాల్లోకి వచ్చాక కుంచెకు దూరమయ్యాడు. చాలాకాలం తర్వాత ఇన్నాళ్లకు తన ‘రంగుల’కలను కేన్వాస్‌పైకి ఎక్కించాడు. గడచిన ఏడాది వ్యవధిలో గీసిన నలభై నైరూప్య చిత్రాలను ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్‌లో ప్రదర్శనకు పెట్టాడు.