సూదులంటే భయం! | affraid of pins | Sakshi
Sakshi News home page

సూదులంటే భయం!

Feb 22 2015 4:17 AM | Updated on Sep 2 2017 9:41 PM

గ్లామర్ ఫీల్డ్‌లో ఏ చిన్న గాయమైనా, షేప్ అవుట్ అయినా వెంటనే ప్లాస్టిక్ సర్జరీలతో సరిచేసుకోవడం మామూలే.

 గ్లామర్ ఫీల్డ్‌లో ఏ చిన్న గాయమైనా, షేప్ అవుట్ అయినా వెంటనే ప్లాస్టిక్ సర్జరీలతో సరిచేసుకోవడం మామూలే. కానీ... కన్నడ నటి అయింద్రిత రాయ్ మాత్రం తన వద్ద అసలా ప్రస్తావనే తేవద్దంటోంది. షూటింగ్ నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది థాయ్‌లాండ్, దుబాయిల్లో ఎంజాయ్ చేసి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన అమ్మడు... గ్లాస్ డోర్‌ను గుద్ది ముక్కు పగలగొట్టుకుంది. దీంతో ముక్కపై మచ్చ ఏర్పడింది. ఈ గాటును పోగొట్టుకోవడానికి చాలామంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారట. అయితే... తనకు సర్జరీలంటే భయమని, సూదులంటే అసహ్యమని చెప్పిందీ భామ. సో... మేకప్‌తోనే మచ్చను కవర్ చేసుకొంటానని తెగేసి చెప్పేసింది. రీసెంట్‌గా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న అయింద్రిత... పాపం మేకప్ కోసం చాలా సేపే కష్టపడాల్సి వచ్చింది.  
 
 షారూఖ్‌కు షాక్!

చూస్తుంటే టీవీ భామలకు బాలీవుడ్ స్టార్లంటే లెక్కలేనట్టుంది. ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ బచ్చన్ ఎపిసోడ్‌కు ఇద్దరు బుల్లితెర నటీమణులు నో చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి సర్గుణ్ మెహతా వంతు! ఈ తార ఏకంగా బాలీవుడ్ బాద్‌షాతో కలసి చేసే ఎపిసోడ్‌నే వదిలేసుకుందట! ఈ టీవీ స్టార్‌కు షారూఖ్ అంటే తెగ పిచ్చి. కానీ... ఇంత మంచి అవకాశం వస్తే ఠక్కున కాదనేసింది. అభిషేక్‌తో ఎపిసోడ్‌కు సదరు భామలు రామని చెప్పిన తరువాత ఫరా... సర్గుణ్‌ను పిలిచింది. దీంతో పాటు షారూఖ్‌తో షోలో కూడా పాల్గొనమని ఆఫర్ ఇచ్చింది. అయితే గియితే కింగ్‌ఖాన్‌తో కలసి సినిమాలో పనిచేస్తాను గానీ... అందరు ఫ్యాన్స్‌లా కలిసే ఆలోచన తనకు లేదని అసలు విషయం చెప్పింది సర్గుణ్! నో చెప్పినందుకు ముందు ఫరా షాక్ తిన్నా... తరువాత సర్గుణ్ మాటలకు కన్విన్స్ అయిందట!  
 
ప్రస్తుతానికి ఒంటరే!

సినిమాల కంటే ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌తో వార్తల్లో ఉంటుంది మలయాళ తార విమలారామన్. ఈ మధ్య ఎవరితోనో క్లోజ్ రిలేషన్ మెయిన్‌టేన్ చేస్తోందని మల్లువుడ్ కోడై కూసింది. అయితే వీటన్నింటికీ సింపుల్‌గా ఫుల్‌స్టాప్ పెట్టేసిందీ సుందరి. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని... ఒకవేళ ఉంటే తప్పకుండా అందరికీ పరిచయం చేస్తానని ఓ సందర్భంలో తేల్చి చెప్పింది విమల. ‘ప్రస్తుతానికైతే ఒంటరినే. ఇలానే ఎంతో హ్యాపీగా ఉంది’ అంటున్న విమలారామన్... తన ధ్యాసంతా పనిమీదే ఉందని... అందులోనే ఎడతెరిపి లేనంత బిజీగా ఉన్నానని సెలవిచ్చింది. కానీ... నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు కొందరు ఇండస్ట్రీ జనం. ఎవరేమనుకున్నా... మొత్తానికి అమ్మడు సింగిల్ అని సభాముఖంగా తెలియజేసి... కుర్రకారు గుండెల్లో మంటల్ని చల్లార్చింది!
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement