ఈ మగాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారో!

When will these men learn? - Sakshi

రిపోర్ట్‌ 

ఈ మాట అన్నది ఏ మహిళో కాదు. ఐక్యరాజ్యసమితి! జీతం కోసం మగాళ్లు బయటికి వెళ్లి చేసే పనికి మూడింతల పనిని మహిళలు జీతం లేకుండా ఇంట్లో చేస్తున్నారని సమితి తన తాజా నివేదికలో వెల్లడించింది. పిల్లల్ని కనడం, వాళ్లను పెంచడం, ఇంట్లో పెద్దవాళ్ల సంరక్షణను చూసుకోవడం, కుటుంబ సభ్యులకు సేవలు అందించడం, మంచి నీళ్లు తెచ్చుకోవడం, వండి పెట్టడం.. వీటన్నిటికీ మహిళలు వెచ్చించే శ్రమకు విలువను కడితే.. పురుషుల కన్నా స్త్రీలకు మూడింతలు ఎక్కువగా జీతం రావలసి ఉంటుందని సమితి మహిళా విభాగంలో వివరాల విశ్లేషణ విభాగానికి ప్రధాన అధికారిగా ఉన్న షారా రజావీ ఆ నివేదికలో ఉదహరించారు.

‘ఆడవాళ్ల పనులు’ అని ముద్రవేసి.. బాధ్యతను తప్పించుకుంటున్న పురుషులు ఒక విషయం గమనించాలి. మహిళలు ఈ పనులన్నిటినీ చేయడం మానేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే మూల పడుతుంది అని కూడా రజావీ అన్నారు. ‘‘దీనికి పరిహారం ఒక్కటే. మహిళ శ్రమను తగ్గించడం. వాళ్ల పనులను అందిపుచ్చుకోవడం’ అని ఆమె ఒక సూచన కూడా చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top