‘ప్రతి రోజూ 2,000 అడుగులు వేయండి...
కొత్త పరిశోధన
‘ప్రతి రోజూ 2,000 అడుగులు వేయండి... గుండెజబ్బులకు దూరంగా వెళ్లండి’ అంటున్నారు బ్రిటన్‌కు చెందిన అధ్యయనవేత్తలు. ఇలా ప్రతిరోజూ కనీసం 2000 అడుగులు వేయడం వల్ల కేవలం గుండెజబ్బులనే కాకుండా, పక్షవాతం వంటి జబ్బులనూ నివారించవచ్చని పేర్కొంటున్నారు. దాదాపుగా 40 వేర్వేరు దేశాలకు చెందిన 9,306 మంది వ్యక్తులపై బ్రిటన్ అధ్యయనవేత్తలు ఒక పరిశోధన నిర్వహించారు. వీరిలో కనీసం గుండెజబ్బులు వచ్చే ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ అయినా ఉండేలా చూశారు.
ఇక వారికి కొన్ని సూచనలు చేశారు. బరువు తగ్గడం, ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించడంతో పాటు వారంలో కనీసం 150 నిమిషాల పాటు కచ్చితంగా నడిచేలా చూశారు. ఆరేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కేవలం 10 శాతం మంది మాత్రమే గుండెజబ్బులకు లోనయ్యారు.