విజయాల పట్టు

special  story to  pattu sarries

సోదరీ.. ఎక్కు తొలి మెట్టు.
అవరోధాలను వెనక్కు నెట్టు.
నీపై నువ్వు నమ్మకం పెట్టు... లక్ష్యాలను అందుకునేట్టు!
కట్టు.. విజయాల పట్టు. పెట్టు.. తిలకం బొట్టు.

►ఈ కంచి పట్టు చీరలు ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తాయి. ఏ వయసు వారినైనా అందంగా, హుందాగా చూపుతాయి. వీటికి  హైనెక్, లోనెక్, బోట్‌నెక్‌... బ్లౌజ్‌లతో మోడ్రన్‌ లుక్‌ని తెప్పించవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌ ధరిస్తే లుక్‌ మరింత గ్రాండ్‌గా, సంప్రదాయంగా మారిపోతుంది.

►ఆర్గంజా చీరలకు బెనారస్‌ అంచులు ఓ కొత్త లుక్‌ని తీసుకువచ్చాయి. ఈ చీరలు కొంత ట్రాన్సప రెంట్‌గా, లైట్‌ వెయిట్‌తో ఉంటాయి. వీటికి చీరలోని ఏదైనా రంగు డిజైనర్‌ బ్లౌజ్‌ ధరిస్తే పండగరోజున కొత్తకళతో మెరిసిపోతారు. స్టైలిష్‌గానూ కనపడతారు.

►టిష్యూ కోట శారీస్‌  ధరిస్తే  క్లాసీ లుక్‌తో చూపులను కట్టి పడేస్తారు. పాతకాలపు స్టైల్‌.. లాంగ్‌ స్లీవ్స్, బోట్‌నెక్‌ బ్లౌజ్‌లు ధరిస్తే వేడుకలో వైవిధ్యంగా
కనిపిస్తారు.

►కంచిపట్టు చీర ధరించినప్పుడు లెటెస్ట్‌ ఆభరణాలను ధరిస్తే మోడ్రన్‌ లుక్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ  కట్టుతో బంగారానికే వన్నె తెస్తారు.

►పసుపు–ఎరుపు రంగు కాంబినేషన్‌ కంచిపట్టు పండగలకు ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి చీరల మీదకు టెంపుల్‌ జువెలరీ ధరిస్తే పండగకళ వచ్చేసినట్టే!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top