వరాల పట్టు | Sakshi
Sakshi News home page

వరాల పట్టు

Published Fri, Aug 24 2018 12:18 AM

News fashion to varalakshmi sarees - Sakshi

వరమహాలక్ష్మికి ఇంపైన పట్టుశ్రీ మహాలక్ష్మికి సొంపైన పట్టుకమలాయతాక్షికి కోమలమైన పట్టు శ్రావణలక్ష్మికి సొగసైన పట్టుఏ పట్టు కట్టినా కోరినన్ని  వరాలు ఆ ఇంట కురిసినట్టే! 


లైట్‌ వెయిట్‌
రంగుల హంగులు, పువ్వుల డిజైన్లు లేదంటే ప్లెయిన్‌గా అలరించే ప్రత్యేకత లైట్‌వెయిట్‌ పట్టు చీరల ప్రత్యేకత. వీటికి మోడర్న్‌ టచ్‌ ఇవ్వాలంటే ప్లెయిన్, కాంట్రాస్ట్‌ బ్లౌజ్‌ లేదంటే స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ సరైన ఎంపిక అవుతంది. ఈ తరం మగువ కోరుకునే కాంబినేషన్‌ కట్టు. ఇది. 


పొడవాటి గౌన్‌కూ జోడీ దుపట్టా పట్టు
పండగ వేళ పసుపు, పచ్చ, ఎరుపు కాంతిమంతమైన రంగులు ముంగిళ్లను కళకళలాడేలా చేస్తాయి. అందుకే ఆ హంగులు నింపుకున్న పట్టు డ్రెస్సులు పండగ అందాన్ని Ðð య్యింతలు చేస్తాయి. పొడవాటి పటోలా గౌన్‌ మీదకు పట్టు దుపట్టా ఓ ప్రధాన ఆకర్షణ.


లెహంగాతో పట్టు జత కట్టు
 ప్లెయిన్‌ కుచ్చుల లెహంగా మీదకు పట్టు ఓణీ ధరిస్తే ఓ కళ. లేదంటే ప్లెయిన్‌ పట్టు లెహంగా మీద ఎంబ్రాయిడరీ చేస్తే మరో ఆకర్షణీయమైన కళ.


అనార్కలీకి తోడు పటోలా పట్టు
ప్లెయిన్‌ లాంగ్‌ అనార్కలీకి మెరుపు తీసుకురావాలంటే పువ్వుల ప్రింట్లు ఉన్న పట్టు దుపట్టా లేదంటే ఇక్కత్, పటోలా పట్టును ఎంపికచేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.

పట్టు చీర మగ్గం వర్క్‌
పెద్దంచు అవీ యాంటిక్‌ లుక్‌తో ఆకట్టుకునే పట్టు చీరలు ఇప్పటి ట్రెండ్‌. వీటికి డిజైనర్‌ బ్లౌజ్‌ను జత చేర్చితే గ్రాండ్‌ లుక్‌ వచ్చేస్తుంది.

పండగ వేళ పట్టు ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌ కాన్సెప్టే. శ్రావణ మాసాన వరలక్ష్మీ వ్రతాలు, నోములు, పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు.. ప్రతీది సంబరమే! ప్రతీది సంప్రదాయమే. పువ్వులు–పండ్లు, మామిడితోరణాలు, పసుపు–కుంకుమలతో పాటు పట్టు ఆభరణమై ఎన్నో విధాల జత కట్టచ్చు. పట్టు చీర కడితే చాలు అనుకునే రోజులు కావివి. పట్టును దేనితో జత కట్టవచ్చు అని ఆలోచించే రోజులు. అందుకు డిజైనర్లు సైతం తమ పనితనానికి మెరుగులు పెడుతుంటారు. పట్టును ఎలా ధరించినా కళ ఉట్టిపడుతుంది. కుర్తా, అనార్కలీ, పొడవాటి గౌను మీద పట్టు దుపట్టా, లెహెంగా మీదకు పట్టు ఓణీ జత చేసినా చాలు పండగ కళ వెయ్యింతలు అవుతుంది.
- నిర్వహణ ఎన్‌.ఆర్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement