అక్రమ సంతానం సహజ సంరక్షకురాలు తల్లే! | natural caretaker, illegitimate! | Sakshi
Sakshi News home page

అక్రమ సంతానం సహజ సంరక్షకురాలు తల్లే!

Feb 1 2016 1:15 AM | Updated on Sep 3 2017 4:42 PM

అక్రమ సంతానం సహజ సంరక్షకురాలు తల్లే!

అక్రమ సంతానం సహజ సంరక్షకురాలు తల్లే!

రంజని, ప్రవీణ్‌లు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో సహోద్యోగులు. రెండేళ్ల నుండి వారిద్దరికీ ఒకరికొకరికి పరిచయం.

కేస్ స్టడీ
 
రంజని, ప్రవీణ్‌లు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో సహోద్యోగులు. రెండేళ్ల నుండి వారిద్దరికీ ఒకరికొకరికి పరిచయం. ప్రవీణ్ ఆదర్శభావాలు గల వ్యక్తి. ఎప్పుడూ మహిళలు, వారి హక్కులు, వారి అభ్యున్నతి మొదలగు విషయాలు గురించి చక్కగా మాట్లాడేవాడు. అతని ఆదర్శాలకు అట్రాక్ట్ అయి రంజని అతని పట్ల ప్రేమ పెంచుకుంది. ప్రవీణ్ కూడా ఆమె పట్ల ప్రేమ పెంచుకున్నాడు. ఇరువురూ వివాహం చేసుకుందామని, కొంతకాలం పాటు హాయిగా గడిపి ఆ తర్వాతే వివాహమని అనుకున్నారు. ఫలితం రంజని గర్భవతి. షరా మామూలే. ప్రవీణ్ ప్రవృత్తి మేడి పండులాంటిదే. పైగా అతడు ముందే వివాహితుడనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రంజని మనసు దిటవు చేసుకొని ప్రవీణ్‌ను పక్కన పెట్టింది. పండంటి పాపను కన్నది.

3 ఏళ్లు గడిచింది. హఠాత్తుగా ప్రవీణ్ నుండి కోర్టు నోటీసులు వచ్చాయి పాపను తనకు అప్పగించాలని, తాను పాపకు తండ్రిని/సహజ సంరక్షకుడినని. దిగ్భ్రాంతికిలోనై రంజని లాయర్‌ను సంప్రదించింది. తమకు పెళ్లే కాలేదని, పైగా ప్రవీణ్ అప్పటికే వివాహితుడని, ఒక బాబు కూడా ఉన్నాడని లాయర్ ముందు భోరుమంది. ‘హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ ఆర్ట్ 1956’లోని సెక్షన్ 6 మైనర్ పిల్లల సహజ సంరక్షకుల గురించి తెలియచేస్తుంది.  మైనర్ బాలుడు, అవివాహిత బాలిక యొక్క సహజ సంరక్షకుడు తండ్రి. తండ్రి తర్వాత తల్లి సహజ సంరక్షకురాలు  5 సం॥లోపు వయసు గల పిల్లల కస్టడీ తల్లికే ఇవ్వాలి  అక్రమ సంతానం బాలుడైనా, బాలికైనా సహజ సంరక్షకురాలు తల్లి అవుతుంది. తల్లి తర్వాతే తండ్రి నేచురల్ గార్డియన్ అవుతాడు. ఇక్కడ రంజని ‘పాప’ అక్రమ సంతానమవుతుంది. కనుక ప్రవీణ్‌కు కస్టడీ ఇవ్వరు. తను నేచురల్ గార్డియన్ కాడు. అంతేగాక 5 సం॥వయసు కనుక తల్లే కస్టడీ పొందుతుంది. చట్టం గురించి తెలుసుకున్న రంజని ఊపిరి పీల్చుకుంది. కానీ తమ తప్పుకు, తొందరపాటుకు, అనాలోచిత చర్యలకు పాపకు ‘అక్రమసంతానం’ అనే చట్టపరమైన ముద్ర పడబోతుందని కృంగిపోయింది.
 

Advertisement
Advertisement