క్యాట్‌వాక్‌ చేస్తూ కుప్పకూలి.. | Model Tales Soares Dies After Collapsing On Catwalk | Sakshi
Sakshi News home page

క్యాట్‌వాక్‌ చేస్తూ కుప్పకూలి..

Apr 28 2019 10:22 AM | Updated on Apr 28 2019 2:31 PM

Model Tales Soares Dies After Collapsing On Catwalk - Sakshi

క్యాట్‌వాక్‌ చేస్తూ మృత్యుఒడిలోకి..

సౌపౌలో : ఫ్యాషన్‌ వీక్‌లో క్యాట్‌వాక్‌ చేస్తూ కుప్పకూలిన బ్రెజిల్‌ మోడల్‌ మరణించాడని నిర్వాహకులు తెలిపారు. సౌపోలో ఫ్యాషన్‌ వీక్‌ (ఎస్‌పీఎఫ్‌డబ్ల్యూ) ఈవెంట్‌ ముగింపు రోజు క్యాట్‌వాక్‌ చేస్తూ మోడల్‌ టేల్స్‌ సోర్స్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, అనంతరం చికిత్స పొందుతూ మరణించాడని నిర్వాహకులు వెల్లడించారు.

26 ఏళ్ల సోర్స్‌ క్యాట్‌వాక్‌ చేసి వెనుతివరిగి వస్తూ రన్‌వేపై పడిపోగా, హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటివకే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. సోర్స్‌ మరణం పట్ల ఫ్యాషన్‌ వీక్‌ నిర్వాహకులు సహా తోటి మోడల్స్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement