కలబంద... పార్లర్‌ని ఇంటికి తెస్తుంది! | kalabanda parlour | Sakshi
Sakshi News home page

కలబంద... పార్లర్‌ని ఇంటికి తెస్తుంది!

Mar 25 2015 12:06 AM | Updated on Sep 2 2017 11:19 PM

కలబంద...  పార్లర్‌ని  ఇంటికి  తెస్తుంది!

కలబంద... పార్లర్‌ని ఇంటికి తెస్తుంది!

మార్కెట్లో కొత్త కాస్మొటిక్ వస్తే ప్రయత్నించి చూద్దామా అని మనసు లాగుతుంది.

మార్కెట్లో కొత్త కాస్మొటిక్ వస్తే ప్రయత్నించి చూద్దామా అని మనసు లాగుతుంది. కానీ పడకపోతే మొత్తానికే మోసం వస్తుందేమో అన్న భయం వెనక్కి లాగుతుంది. అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా వాడే నేచురల్ కాస్మొటిక్ ఒకటుంది. అదే కలబంద. ఇది బ్యూటీపార్లర్‌ని ఇంటికే తెస్తుంది.
  తేనె, పసుపు పాలు, అలొవేరాలను రుబ్బి ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది
  ఓట్స్‌ని పొడి చేసి, కలబంద రసం కలిపి ప్యాక్ వేసుకుంటే డెడ్‌స్కిన్ తొలగిపోతుంది
  కలబంద గుజ్జులో కీ రదోస రసం, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువ వువుతుంది  ఎండకి చర్మం నల్లబడితే... కలబంద జిగురులో టొమాటో రసం కలిపి రాసుకుంటే నలుపు పోతుంది  కలబంద గుజ్జులో నిమ్మరసం, ఖర్జూరం కలిపి వారానికోసారి ప్యాక్ వేసుకుంటే పొడిదనం పోయి చర్మం తేమగా ఉంటుంది. కలబంద రసంలో బాదం పొడి కలిపి ప్యాక్ వేసుకున్నా మంచిదే  కలబంద గుజ్జులో తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి  కలబంద జిగురులో తేనె, నిమ్మరసం, బాదం నూనె కలిపి వారానికోసారి ప్యాక్ వేసుకుంటే, వేసవిలో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement