అందరికీ వరం

It is necessary for health to be followed in accordance with six seasons - Sakshi

ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవడం ఆరోగ్యానికి అవసరం. శరదృతువు, కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వనభోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ, నేతి బీరకాయలలోని పోషక విలువలు, ఆరోగ్యప్రయోజనాలను ఆయుర్వేదం వివరించింది.

ఉసిరిక (ఆమలకీ) గుణధర్మాలు: దీని రుచి షడ్రసాల (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) లోనూ ఉప్పు (లవణ రసం) మినహా మిగిలిన ఐదు రుచులు ఉంటాయి. ప్రధానంగా నోటికి తగిలేది పులుపు, తీపి, వగరు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కఫాన్ని హరిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. రక్త స్రావాన్ని అరికడుతుంది. అన్ని రకాల మూత్ర వికారాలు శమిస్తాయి. 
వివిధ రూపాలు... పచ్చిగా రసం తీసినా, ఎండబెట్టి వరుగులు చేసినా, గింజలు తీసేసి ఎండిన వరుగులను చూర్ణం చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా, నిల్వ ఉండే ఊరగాయగా మలచినా, దీనిలో గల పోషక విలువలు పదిలంగా ఉంటాయి.
విశిష్ట ఔషధ ప్రయోగాలు: 
 జ్వరాలు: ఉసిరికాయల రసాన్ని నేతితో వేడి చేసి సేవించాలి .
ఆకలి కలగడానికి: నెయ్యి, జీలకర్ర, ఇంగువ చేర్చి, ఉసిరి కాయలను నేతితో ఉడికించి తినాలి
అర్శస్‌ (పైల్స్‌/మూలశంక): మజ్జిగలో తిప్పతీగ, ఉసిరిక రసాలను కలిపి తాగాలి. ఉసిరిక చూర్ణానికి, కరక్కాయ, తానికాయ చూర్ణాలను కూడా కలిపి సేవించాలి (త్రిఫల చూర్ణం).
కామలా (జాండిస్‌): ఉసిరిక రసం +
ద్రాక్షరసం రక్తస్రావాలు: ఉసిరి కాయల ముద్దను నేతితో కలిపి వేడి చేసి తలపై పట్టిస్తే ముక్కులో నుంచి వచ్చే రక్తస్రావం తగ్గుతుంది 

బొంగురు గొంతు: ఉసిరిక రసం + పాలు ∙
ఎక్కిళ్లు (హిక్క): ఉసిరిక రసం + వెలగకాయ, పిప్పళ్ల చూర్ణం + తేనె ∙
దగ్గు: ఆమలకీ చూర్ణం + పాలు, నెయ్యి ∙
మూర్ఛ: ఉసిరిక చూర్ణ కషాయం + తేనె ∙
హృదయ రోగాలు: చ్యవనప్రాశ, అగస్త్య లేహ్యం (వీటిల్లో ఆమలకీ ప్రధాన ద్రవ్యం) ∙
వాంతులు: పెసర పప్పుతో జావ కాచి, చల్లార్చి, ఉసిరిక రసం కలిపి సేవించాలి. ఇవేకాక అనేక చర్మరోగాలు, కీళ్ల నొప్పులు, జుట్టు తెల్లబడటం, కంటి రోగాలు ఉపశమిస్తాయి. 
అరటిఆకు  భోజనం విశిష్టత:
ఈ ఆకులో ఉండే పోలిఫినాల్స్‌ ఆహారంలోకి చేరి చాలా వ్యాధులకు నిరోధకంగా పనిచేస్తాయి. ఆకలి పెరిగి, ఉత్సాహం కలుగుతుంది. కృమిహరంగా పనిచేస్తుంది. రకరకాల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 
నేతిబీర: అడవిలో పెరిగేది ఒక రకం, ఇది వాంతికరం. మనం పొలాల్లో పండించేది తినదగినది, జిగురుగా ఉండి కూర రుచికరంగా ఉంటుంది. రక్తదోషాలను హరిస్తుంది. వాత, పిత్త రోగాలను తగ్గిస్తుంది.

డా. వృద్ధుల 
లక్ష్మీనరసింహ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణుల 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top