బ్రాంకైటిస్... | Homeo Health Tips for Bronchitis by M Srikanth | Sakshi
Sakshi News home page

బ్రాంకైటిస్...

Aug 5 2013 11:34 PM | Updated on Sep 1 2017 9:40 PM

బ్రాంకైటిస్...

బ్రాంకైటిస్...

ఈ సీజన్‌లో శ్వాస సరిగా అందకపోవడంతో దమ్ము, ఆయాసంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం నెలకొన్నట్లుగా ముసురు, చినుకులతో ఉన్న వాతావరణం ఉంటే చాలు కొందరిలో ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంటుంది.

 ఈ సీజన్‌లో శ్వాస సరిగా అందకపోవడంతో దమ్ము, ఆయాసంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం నెలకొన్నట్లుగా ముసురు, చినుకులతో ఉన్న వాతావరణం ఉంటే చాలు కొందరిలో ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంటుంది. అంటే వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి మార్పులతో కొందరికి ఊపిరి సక్రమంగా అందదు. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్‌ఫ్లమేషన్ (వాపు) వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ కండిషన్‌నే వైద్యపరిభాషలో ‘బ్రాంకైటిస్’ అంటారు. 
 
 కారణాలు 
 చల్లటి వాతావరణం సరిపడకపోవడం  
 జలుబు  
 ఫ్లూ జ్వరం 
 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్  
 నిమోనియా  
 దుమ్మూ, ధూళి, పొగ, రసాయనాలు, సిగరెట్ పొగ వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడటం  
 పొగతాగేవారు ఉన్న కుటుంబాల్లోని చిన్నపిల్లల్లో శ్వాసకోశనాళాలు పొగ 
 పెంపుడుజంతువుల వెంట్రుకలు  
 గాలీ వెలుతురు సరిగా సోకని గదుల వంటి అనేక కారణాలు బ్రాంకైటిస్‌కు దోహదపడతాయి. 
 
 లక్షణాలు 
 శ్వాసనాళాలు బిగదీసుకుని పోయినట్లుగా ఉండి ఊపిరి సరిగా అందకపోవడం  జ్వరం  
 చలి  
 కండరాలనొప్పులు  
 ముక్కుదిబ్బడ  
 ముక్కుకారడం  
 గొంతునొప్పి  
 తలనొప్పి  
 కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు వారాల పాటు దగ్గు  
 ఛాతీలో నొప్పి  
 ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం 
 పిల్లికూతలు  
 ఆయాసం  
 ఎక్కువదూరం నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
 దీర్ఘకాలం కనిపించే అవకాశాలు  
 శ్వాసకోశ నాళాల్లో కలిగే మార్పుల వల్ల ఆయాసం, దగ్గు, కఫం, జ్వరం, నీరసం వంటి మాటిమాటికీ కనిపిస్తూ ఒక్కోసారి అది దీర్ఘకాలం కనిపించే వ్యాధిగా మారుతుంది. దీన్నే ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. దీనితో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమాలోకి దింపడం వంటి పరిణామాలు కూడా సంభవిస్తాయి. 
 
 రోగనిర్ధారణ  
 ఛాతీ ఎక్స్-రే  
 కఫం కల్చర్ (స్పుటమ్ కల్చర్)  
 పీఎఫ్‌టీ (స్పైరోమెట్రీ), పూర్తి రక్త పరీక్ష (సీబీపీ), ఈఎస్‌ఆర్ 
 
 హోమియోలో వాడదగ్గమందులు  
 ఆంటిమ్ టార్ట్, కార్బోవెజ్, లొబీలియా, కాలీకార్బ్, ఆర్సినికమ్, స్పాంజియా, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఇపికాక్ లాంటి మందులను రోగి లక్షణాలను, మానసిక ప్రవృత్తి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మోతాదును, మందులను నిర్ణయించాల్సి ఉంటుంది.
 
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., 
 హోమియోకేర్ ఇంటర్నేషనల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement