
కెరీర్‌కు.. కామర్స్ సర్టిఫికెట్ కోర్సులు
ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలతో మన దేశం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తోంది. భారీ సంఖ్యలో బహుళజాతి సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. వీటితోపాటు వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి.
కెరీర్ కౌన్సెలింగ్
ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలతో మన దేశం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తోంది. భారీ సంఖ్యలో బహుళజాతి సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. వీటితోపాటు వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యం లో కామర్స్ చదివిన విద్యార్థులకు అపార అవకాశాలు ముందుకొచ్చాయి. ఇంటర్మీడియెట్ (సీఈసీ/ఎంఈసీ), బీకాం, ఎంకాం చదివినవారికి వివిధ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కామర్స్.. సంబంధిత అంశాల్లో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులన్నీ దాదాపు ఆరునెలలు/ఏడాది వ్యవధితో ఉంటున్నాయి.
మరికొన్ని సంస్థలు రెండు రోజుల (గంటల లెక్కన) నుంచి వారం వ్యవధి ఉన్న కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని కోర్సులకు ఇంటర్మీడియెట్ (సీఈసీ/ఎంఈసీ), మరికొన్ని కోర్సులకు బీకాంలో ఉత్తీర్ణత సాధించాలి. సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేస్తే గ్రాడ్యుయేషన్‌లో నేర్చుకున్న సబ్జెక్టులకు అదనంగా నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. తద్వారా జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు. వివిధ యూనివర్సిటీలు అందిస్తున్న కామర్స్.. సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు..
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ - న్యూఢిల్లీ
కోర్సులు: సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ), సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్. వెబ్‌సైట్: http://iifm.co.in
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
కోర్సు: ఈ-కామర్స్
వెబ్‌సైట్: www.unom.ac.in
యూనివర్సిటీ ఆఫ్ కేరళ - తిరువనంతపురం
కోర్సు: ఈ-కామర్స్
వెబ్‌సైట్: www.keralauniversity.ac.in
యూనివర్సిటీ ఆఫ్ పుణే
కోర్సు: ఈ-కామర్స్
వెబ్‌సైట్: www.unipune.ac.in
యూనివర్సిటీ ఆఫ్ ముంబై
కోర్సులు: అకౌంటెన్సీ, అకౌంట్స్ ఆఫ్ ట్రస్ట్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ (సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్), బేసిక్ అకౌంటింగ్, డెరైక్ట్ ట్యాక్సెస్ (ఇన్‌కం ట్యాక్స్), కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అండ్ ట్యాలీ ప్యాకేజ్, ఈ-కామర్స్, ట్యాక్స్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్, ఎన్విరాన్‌మెంటల్ ఆడిటింగ్.
వెబ్‌సైట్: www.mu.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ - ముంబై
కోర్సులు: సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇన్..
► ఎస్‌ఎంఈ ఫైనాన్స్ ఫర్ బ్యాంకర్స్
► క్రెడిట్ కార్డ్ ఫర్ బ్యాంకర్స్
► క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
► ట్రేడ్ ఫైనాన్స్
► మైక్రో ఫైనాన్స్
వెబ్‌సైట్: www.iibf.org.in