ప్రతి పనీ ఒక యుద్ధమే! | Sakshi
Sakshi News home page

ప్రతి పనీ ఒక యుద్ధమే!

Published Mon, Nov 10 2014 10:54 PM

ప్రతి పనీ ఒక యుద్ధమే!

లైఫ్‌బుక్
 
 ‘రబ్‌నే బనాదీ జోడీ’తో చిత్రరంగానికి పరిచయమై పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనుష్కశర్మ ప్రస్తుతం అమీర్‌ఖాన్ ‘పీకె’ చిత్రంలో నటిస్తున్నారు. విరాట్ కోహ్లీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఇటీవల వార్తల్లోకెక్కిన ఆమె మనసులోని మాటలు...

అయిదు సంవత్సరాల తరువాత... సినీ పరిశ్రమకు వచ్చి అయిదు సంవత్సరాలు దాటి పోయాయి. ముక్కుసూటిగా మాట్లాడే నేను, మనసులో ఉన్నదే మాట్లాడే నేను ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో నెగ్గుకు రావడం విశేషమనే అనుకుంటున్నాను. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ పేరొచ్చే సినిమాలు చేయాలని పరిశ్రమలోకి వచ్చే ముందు అనుకున్నాను. ఇప్పుడూ... దానికే కట్టుబడి ఉంటున్నాను. కాలమే పాఠాలు నేర్పిస్తుంది. గతంతో పోలిస్తే స్క్రిప్ట్‌లను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో నాలో కొంత పరిణతి వచ్చింది.

 నిర్మాతగా... టులతో పోల్చితే నిర్మాత అనే పోస్ట్‌కు గ్లామర్ ఉండక పోవచ్చు. రిస్క్‌లు ఉండవచ్చు. ‘‘ప్రొడ్యూసర్ అంటే మాటలు కాదు...ఎన్నో రిస్క్‌లు ఉంటాయి’’ అన్నవాళ్లు ఎందరో. అయితే సవాళ్లను ఎదుర్కోవాలనే ఉత్సాహం ఉన్నప్పుడు వెనకడుగు వేయడం ఎందుకు? ప్రయోగం లేకుండా విజయం లేదు. జీవితమే లేదు. అందుకే సినిమా నిర్మాణాన్ని ఇష్టపడతాను. మనసుకు నచ్చిన చిత్రాలు నిర్మిస్తాను.

కష్టంపై ఇష్టం... ప్రతి పనిని ఒక యుద్ధంలాగే భావిస్తాను. యుద్ధంలో పొరపాట్లు చేస్తే ఓటమి ఎలాగో పనిలో కూడా అలాగే.
 యుద్ధం చేసే సమయంలో కనిపించే అంకితభావం, దూసుకెళ్లడంలాంటివి మనం చేస్తున్న పనిలో కూడా కనిపించాలి. అప్పుడే మంచి ఫలితాలు సాధించగలం. కష్టపడే వ్యక్తులతో పని చేస్తున్నప్పుడు ‘కష్టం’ మీద ‘ఇష్టం’ పెరుగుతుంది. ‘పీకె’’ సినిమాలో అమీర్‌ఖాన్‌తో పని చేసినప్పుడు పని మీద మరింత శ్రద్ధ పెరిగింది.
 
 అనుష్క శర్మ, హీరోయిన్

Advertisement
Advertisement