నన్ను మోయండి.. మా పార్టీని గెలిపించండి...

నన్ను మోయండి..  మా పార్టీని గెలిపించండి... - Sakshi


 ఈ ఫొటోలో ఉన్నది తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే సంపత్‌కుమార్. వేలూరు లోక్‌సభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి సెంగుత్తవన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఇలా కావడిలో బయల్దేరారు! ఆయన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,000 అడుగుల ఎత్తున ఉండే నెగ్నకొండలో 600 మంది ఓటర్లున్నారు. వెళ్లి వారిని ఆకట్టుకోవాలన్నది ప్లాను.కానీ ఆ కొండ ఎక్కాలంటే 8 కిలోమీటర్ల దూరం కాలినడకే శరణ్యం. ఎమ్మెల్యేగారికేమో కాలికి గాయమైంది. గాయపడ్డ కాలితో కొండెక్కలేనంటూ చేతులెత్తేయడంతో ఆయన అనుచరగణం ఇలా దుప్పటితో కావడి సిద్ధం చేసింది. ఎమ్మెల్యేను అందులో కూర్చోబెట్టి మోసుకుంటూ కొండపైకి తీసుకెళ్లారు. ఎలాగైతేనేం... తొలిసారిగా ఎమ్మెల్యే తమ వద్దకు రావడంతో నెగ్నకొండ ప్రజలు సంబరపడిపోయారు.

 - సి. నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top