ఇది మా వైఫల్యమే: ఉత్తమ్ | we are responsible for this | Sakshi
Sakshi News home page

ఇది మా వైఫల్యమే: ఉత్తమ్

May 17 2014 1:02 AM | Updated on Aug 29 2018 8:56 PM

‘మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు... ఈ విషయాన్ని గడప గడపకూ తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాం..’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు... ఈ విషయాన్ని గడప గడపకూ తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాం..’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేరిన సందర్భంగా.. ఎన్నికల్లో వచ్చిన తీర్పు బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్  అధినేత్రి  సోనియా సీమాంధ్రలో పార్టీని త్యాగం చేసి తెలంగాణ ఇచ్చినా, దాన్ని తాము ప్రజల్లోకి తీసకువెళ్లలేక పోయామని భావిస్తున్నట్లు తెలిపారు. జరిగిన పొరపాట్లు, వైఫల్యాలను విశ్లేషించుకుని కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నందున కొంత వ్యతిరేకత కూడా ఉంటుందని వివరించారు. ఓటమికి  తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమష్టి బాధ్యత వహిస్తుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement