'చంద్రబాబుతో చేరడానికి లగడపాటి తాపత్రయం' | Vasireddy Padma Slams Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుతో చేరడానికి లగడపాటి తాపత్రయం'

May 4 2014 2:09 PM | Updated on Aug 14 2018 4:24 PM

'చంద్రబాబుతో చేరడానికి లగడపాటి తాపత్రయం' - Sakshi

'చంద్రబాబుతో చేరడానికి లగడపాటి తాపత్రయం'

లగడపాటి రాజగోపాల్, పవన్‌ కళ్యాణ్లు పొలిటికల్ జోకర్లు అని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

హైదరాబాద్: లగడపాటి రాజగోపాల్, పవన్‌ కళ్యాణ్లు పొలిటికల్ జోకర్లు అని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు పంచన చేరడానికే లగడపాటి తాపత్రయపడుతున్నారని అన్నారు. లగడపాటి, పవన్‌ ప్రచారంతో తమ పార్టీకే లాభమని చెప్పారు. చంద్రబాబును ఓటమి భయం చుట్టుముట్టిందని, అందుకే పోలింగ్‌కు 2 రోజుల ముందు కాపులను బీసీల్లో చేరుస్తానని అబద్ధపుహామీ ఇస్తున్నారని అన్నారు.

బీసీ, కాపులకు మెజార్టీ సీట్లు ఇవ్వలేని చంద్రబాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులను ఎర వేస్తున్నారని దుయ్యబట్టారు. కాపు, బీసీలతో పాటు పేద, మధ్యతరగతి, మహిళ, యువత అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ సీపీ వెంటే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు రావణాసురుడు లాంటి వారని ఆక్షేపించారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక మోడీ, పవన్, లగడపాటి, రామోజీలను అరువు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ-టీడీపీ కూటమి, పవన్‌ ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్నికల్లో వైఎస్ జగన్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement