వైఎస్సార్ సీపీ సత్తా చాటుతాం | the bike rally under YSRCP in tandur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ సత్తా చాటుతాం

Apr 18 2014 12:02 AM | Updated on Aug 29 2018 8:54 PM

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ సీపీ సత్తా చాటుతామని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి, తాండూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రభుకుమార్ ధీమా వ్యక్తంచేశారు.

తాండూరు టౌన్, న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ సీపీ సత్తా చాటుతామని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి, తాండూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రభుకుమార్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం తాండూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి, ప్రభుకుమార్ మాట్లాడుతూ.. స్వార్ధపూరిత రాజకీయాలతో పేదల అభివృద్ధిని మరిచిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. జిల్లాలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్ సీపీ దక్కించుకుంటుందని వారు ధీమా వ్యక్తంచేశారు.

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుపరిచిన ప్రజా సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు, రైతులకు రుణాలు, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్సార్ సీపీకి ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు. అంతకుముందు స్థానిక విలియంమూన్ చౌరస్తా నుంచి ఇందిరాచౌక్, శివాజీచౌక్, మల్‌రెడ్డిపల్లి, బసవన్నకట్ట, పాతతాండూరు మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. మల్‌రెడ్డిపల్లి, పాతతాండూరు, గుమాస్తానగర్‌తోపాటు పలుచోట్ల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, వడ్డెర సంఘం రాష్ట్ర మహిళాధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు హబీబ్‌ఖాన్, సత్యమూర్తి, మంజుల, ఆనంద్, అమ్జద్, సంతోష్, అఖీల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement