టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం | TDP Promotional jeep Overshot the boy killed | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం

Apr 7 2014 12:53 AM | Updated on Aug 14 2018 4:21 PM

టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం - Sakshi

టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం

టీడీపీ ప్రచార జీపు ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనలో ఓ వాహనం ధ్వంసం కాగా, ఓ హోటల్ డబ్బాకు బాధితులు నిప్పంటించారు. వివరాలు..

నారాయణపేట, న్యూస్‌లైన్ :  టీడీపీ ప్రచార జీపు ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనలో ఓ వాహనం ధ్వంసం కాగా, ఓ హోటల్ డబ్బాకు బాధితులు  నిప్పంటించారు.  వివరాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండలో టీడీపీ ప్రచార జీపు తిరుగుతోంది.
 
 అదే సమయంలో గ్రామ బొడ్రాయి సమీపంలో బాల్‌రాజ్ (6) కంకర కుప్పపై ఆడుకుంటున్నాడు. అతన్ని గమనించకుండానే డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడపడంతో ఆ బాలుడు దుర్మరణం చెందాడు. దీంతో ఆగ్ర హించిన ప్రజలు రాళ్లు, కర్రలతో అద్దాలు పగులగొట్టి జీపును ధ్వంసం చేశారు. దాని యజమాని ఇంటిముందు మృతదేహంతో బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని  సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పట్టుబట్టారు. దీంతో గ్రామ పెద్దలతో చర్చించి అందుకు సరేననడంతో వారు శాంతించి వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement