కాంగ్రెస్‌పై ప్రతీకారంతోనే రామ్‌దేవ్ బీజేపీ జపం | Ramdev supporting BJP to avenge Congress: AAP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై ప్రతీకారంతోనే రామ్‌దేవ్ బీజేపీ జపం

Apr 13 2014 1:58 AM | Updated on Aug 29 2018 8:54 PM

కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే యోగా గురువు బాబా రాందేవ్ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆయన మాజీ సన్నిహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు దినేష్ వాఘేలా ఆరోపించారు.

మాజీ సన్నిహితుడి ఆరోపణ
 పనాజీ: కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే యోగా గురువు బాబా రాందేవ్ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆయన మాజీ సన్నిహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు దినేష్ వాఘేలా ఆరోపించారు. 2011లో ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరాహార దీక్ష సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరించిన తీరుతో బాబా ప్రతీకారేచ్ఛతో ఉన్నారని చెప్పారు. దినేష్ వాఘేలా పార్లమెంట్ ఎన్నికల్లో అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు.
 
రాందేవ్ బాబా స్థాపించిన భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సభ్యుడిగా పని చేశారు. బాబా తన చర్యలకు పశ్చాత్తాప పడక తప్పదని వాఘేలా హెచ్చరించారు. ‘వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే భారత్ స్వాభిమాన్ ట్రస్టులో చేరా. ఆ తరువాత నిజంగా ఎవరిలోనైనా మార్పు వచ్చిందంటే అది బాబా రాందేవ్‌లోనే’ అని వాఘేలా వ్యాఖ్యానించారు. అయితే దేశాన్ని జాగృతం చేసినందుకు బాబాను తాను ఇప్పటికీ గౌరవిస్తానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement