'రాహుల్ అంబేద్కర్ను అవమానిస్తున్నారు' | Rahul insulting Ambedkar by taking credit for laws: Narendra Modi | Sakshi
Sakshi News home page

'రాహుల్ అంబేద్కర్ను అవమానిస్తున్నారు'

Apr 14 2014 2:48 PM | Updated on Jun 4 2019 6:28 PM

'రాహుల్ అంబేద్కర్ను అవమానిస్తున్నారు' - Sakshi

'రాహుల్ అంబేద్కర్ను అవమానిస్తున్నారు'

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ... అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారని బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఆరోపించారు.

అహ్మదాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ... అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారని బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఆరోపించారు. రాజ్యాంగం ద్వారా దళితులకు, పీడితులకు హక్కులు కల్పించింది అంబేద్కర్‌ అయితే తామే కల్పించామంటూ రాహుల్‌గాంధీ ప్రచారం చేసుకుంటున్నారని ఆమన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాహుల్‌కు దేశ చరిత్ర, సంస్కృతి తెలీదని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. నెహ్రూ కుటుంబానికి చెందిన గాంధీలందరికీ భారతరత్నలు వెంటనే ఇచ్చారని మరి అంబేద్కర్‌కు అంత ఆలస్యంగా ఎందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement