యూపీఏను సాగనంపాలి: గోవా సీఎం పారికర్ | give send off to upa government | Sakshi
Sakshi News home page

యూపీఏను సాగనంపాలి: గోవా సీఎం పారికర్

Apr 26 2014 3:14 AM | Updated on Sep 2 2017 6:31 AM

దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అన్ని విధాలా భ్రష్టుపట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు.

 హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అన్ని విధాలా భ్రష్టుపట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్‌లోని హరితా హోటల్‌లో ‘ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలోను, అంతకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు ఇరుపార్టీలకు మేలు చేస్తుందన్నారు. సీమాంధ్రలో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, తెలంగాణలో ఆశించిన స్థాయిలో స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని, స్పష్టమైన మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement