బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అలనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినికి కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది.
మధుర: బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అలనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినికి కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు గాను హేమమాలినితో పాటు రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు జయంత్ చౌదరిని ఈసీ హెచ్చరించింది.
హేమమాలిని, జయంత్ మీడియా ప్రకటనలను పర్యవేక్షించే కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోకుండా వ్యక్తిగత ప్రకటనలు ఇవ్వడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటనల్ని పునరావృతం చేయవద్దంటూ ఇద్దరినీ హెచ్చరించింది.