నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం పదకొండు గంటలకు నోటిఫికేషన్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం పదకొండు గంటలకు నోటిఫికేషన్‌ను ఫారం-1లో విడుదల చేశారు. ఇందులో అభ్యర్థులకు ఆరు సూచనలు చేశారు. ఎంపీ నియోజకవర్గం నుంచి ఒక సభ్యునికి ఎన్నిక జరుగుతుందని పొందుపరిచారు. నామినేషన్ పత్రాలను తనకు గానీ ఏఆర్వో ఏజేసీ నాగేశ్వరరావుకు గానీ సమర్పించాలన్నారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 21న పరిశీలిస్తామని నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. మే7న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకూ పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన రోజున అన్ని పార్టీల అభ్యర్థులతో నామినేషన్లు, ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలు తెలియజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పుస్తకాల అందజేత ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు భారత ఎన్నికల సంఘం ముద్రించిన నియమ నిబంధనల పుస్తకాలను కలెక్టర్ కాంతిలాల్ దండే అందించారు. అశోక్ తో పాటు ఆయన భార్య సునీలా గజపతిరాజు కూడా ఈ పుస్తకాలను అందుకున్నారు. అనంతరం రశీదుల మీద సంతకాలు చేశారు.