
సీమాంధ్రలో ఐఐటీలు పెడతాం: వెంకయ్య
తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.
చిత్తూరు: తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడంలేదని అన్నారు. నాగర్జునసాగర్, దుమ్ముగూడెం నుంచి సీమాంధ్రకు 200 టీఎంసీల నీరు కేటాయిస్తామన్నారు.
శ్రీకాకుళం-చెన్నై గంగా కావేరీ జలాలను అనుసంధానం చేస్తామన్నారు. సీమాంధ్రలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు సీమాంధ్రలో నెలకొల్పుతామన్నారు. కమ్యునిస్టులు ప్రపంచమంతా ఏకం కావాలంటారు... రాష్ట్రంలో మాత్రం నారాయణ, రాఘవులు మాత్రం కలవరని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు.