78.54 శాతం పోలింగ్ నమోదు

78.54 శాతం పోలింగ్ నమోదు - Sakshi

  •  2009 కన్నా 6 శాతం ఎక్కువ

  •  నర్సంపేటలో అత్యధికం

  •  చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

  •  కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ 6 శాతం పెరిగింది. 2009లో 72.84శాతం ఉండగా.. ఇప్పుడు 78.54 శాతం నమోదైంది. ఓటరు చైతన్య కార్యక్రమాలతో పాటు పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లపై విస్తృత ప్రచారం, పోలింగ్ రోజు ఎండ తీవ్రత తక్కువగా ఉండడం వంటి అంశాలు పోలింగ్ పెరగడానికి దోహదం చేశాయి. మారుమూల ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ప్రక్రియ పూర్తిచేసినా.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ గతం కన్నా పెరిగి 80శాతానికి చేరువైంది.   ప్రధానంగా అభ్యర్థుల మధ్య ఉన్న పోటీ ప్రభావం పోలింగ్ శాతంపై కనిపించింది.

     

     తూర్పులో 11.95 శాతం పెరుగుదల

     వరంగల్ తూర్పు నియోజకవర్గం కూడా పూర్తిగా అర్బన్ ప్రాంతమైనప్పటికీ పోలింగ్ శాతంలో తూర్పు, పశ్చిమకు తీవ్ర వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పశ్చిమలో 2009తో చూస్తే అతితక్కువగా కేవలం 3శాతం మాత్రమే ఓటింగ్ పెరిగితే.. తూర్పులో మాత్రం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా అత్యధికంగా పోలింగ్ పెరిగింది. 2009తో చూస్తే సుమారు 11.95శాతం పెరగడం విశేషం. 2009లో 59.87 శాతం ఉండగా 2014లో 71.82 శాతంగా నమోదైంది. తూర్పు, పశ్చిమ రెండూ అర్బన్ పరిధిలోవే అయిప్పనటికీ... పోలింగ్ శాతంలో తేడా ఉండటం గమనార్హం.  



     పశ్చిమ చివరి స్థానంలో...

     జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ పరుగులు పెట్టగా.. అర్బన్ ప్రాంత ఓటర్లుండే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం పాత కథే పునరావృతమైంది. 2009తో పోల్చి చూస్తే కాస్త నయం అనిపించినా అధికారులు అంచనాల మేరకు ఇక్కడ పోలింగ్ శాతం పెరుగలేదు. అయితే ఇక్కడ ఓటర్ల నమోదు నుంచి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్, పోల్‌స్లిప్‌ల పంపిణీ, ఓట్లు గల్లంతు, పోలింగ్ రోజు అధికారుల నిర్లక్ష్యపు పనులు వంటి అనేక కారణాలు తక్కువ పోలింగ్ శాతం నమోదుకు కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లా పోలింగ్ 6.19శాతం పెరిగితే పశ్చిమలో మాత్రం 3.61శాతం మాత్రమే పెరిగింది.

     

     ఆరు స్థానాల్లో 80 శాతానికి పైగా...

     స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలలో ఈసారి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. జనగామ, భూపాలపల్లిలో కూడా కొద్దిపాటి తేడాతో 80 శాతంగా ఉంది. ఇక పెరుగదల విషయంలో వరంగల్ తూర్పు తర్వాత వర్ధన్నపేట (9 శాతం), భూపాలపల్లి(8.69 శాతం), పరకాల (8.25 శాతం), జనగామ (7.97 శాతం) నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది.

     

     ఆ బూత్‌లో ఓటు వేయునిది ఒక్కరే ..!

     నర్సంపేట : పోలింగ్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న నర్సంపేట నియోజకవర్గంలో వురో రికార్డు నమోదైంది. చెన్నారావుపేట వుండలం పాత వుుగ్దుంపురంలోని 179 పోలింగ్ బూత్ పరిధిలో ఒక్క వుహిళ వూత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ బూత్‌లో 867 ఓట్లు ఉండగా.. 414 వుంది పురుషులు, 453 వుంది వుహిళలు ఉన్నారు. పురుషులందరూ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు చైతన్యాన్ని చాటిచెప్పగా.. ఒక్క వుహిళ వూత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో ఈ బూత్‌లో పోలింగ్ 99.89 శాతంగా నమోదైంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top