బీపీవో ఇంటర్వ్యూ.. టాప్ కొశ్చన్స్

బీపీవో ఇంటర్వ్యూ.. టాప్ కొశ్చన్స్


బీపీవో ఇంటర్వ్యూలు అనేక రౌండ్లతో సుదీర్ఘంగా ఉంటాయి. వీటిలో విజయం సాధించాలంటే పట్టుదల, సమయస్ఫూర్తి ఉండాల్సిందే. ఔత్సాహికులకు ఉపయోగపడేలా బీపీవో ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి తగిన సమాధానాలు...

 

1. మీ గురించి చెప్పండి?

ఇంటర్వ్యూయర్‌లకు అత్యంత ఇష్టమైన ప్రశ్న. దీనికి మీ సమాధానం అంతే ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా ఉండాలి.

 

2. బీపీవో అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?

బీపీవో అంటే.. బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. ఇవి ఇతర కంపెనీల నాన్‌కోర్  కార్యకలాపాలకు సంబంధించి ఔట్‌సోర్సింగ్ సేవలందిస్తాయి.

 

3. రాత్రి వేళల్లో పనిచేయగలరా?

అభ్యంతరం లేదని చెప్పండి. ఎలాంటి సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనండి.

 

4. ఆఫ్‌షోర్ అవుట్‌సోర్సింగ్ అంటే ఏమిటి?

సుదూర దేశాల కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ సేవలను అందించే వాటిని ఆఫ్‌షోర్ కంపెనీలు అంటారు. చుట్టుపక్కల దేశాల కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ సేవలను అందించేవి షోర్ సోర్సింగ్ కంపెనీలు.

 

5. ఇన్‌బాండ్, అవుట్ బాండ్ కాల్‌సెంటర్ల మధ్య వ్యత్యాసం ఏమిటి?

సేవలకు సంబంధించి కాల్స్‌ను మాత్రమే అందుకునేవి ఇన్ బాండ్ కాల్ సెంటర్లు. సేవలకు సంబంధించి వినియోగదారులకు కాల్స్ చేసే కంపెనీలను అవుట్ బాండ్ కాల్ సెంటర్లు అంటారు.

 

6. బీపీవోలనే మీ కెరీర్‌గా ఎందుకు ఎంచుకున్నారు?

కెపీవో అంటే..నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్‌లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి.7. కేపీవో, బీపీవో మధ్య వ్యత్యాసం ఏమిటి?

కెపీవో అంటే.. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి.

 

8. కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ అవసరం ఏమిటి?

బీపీవోలకు నాన్ కోర్ సర్వీసెస్‌ను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా  కంపెనీలకు డబ్బు ఆదా అవడంతో పాటు నాణ్యతతో కూడిన సేవలు అందుతాయి.

 

9. వినియోగదారులతో చక్కగా మాట్లాడగలరా?

మాట్లాడగలను అని చె ప్పండి. మాక్ కాల్ వస్తేఆకట్టుకునేలా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

 

10. 5 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు?

కంపెనీకి ‘నా సేవలు ఏ స్థాయిలో అయితే గరిష్టంగా ఉపయోగపడతాయో అక్కడికి చేరుకోవాలనుంది’ అని చెప్పండి.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top