ఆదివాసులను అడవుల నుండి గెంటివేస్తారా!

ఆదివాసులను అడవుల నుండి గెంటివేస్తారా! - Sakshi


- కె.గోవర్దన్

 

గత 45 ఏళ్లుగా ఆదివాసీలు, ఇతర గిరిజను లు తెలంగాణ ఫారెస్టులో సాగు చేసుకుం టున్న పోడు భూములను బలవంతంగా లాక్కొని అడవిలో కలుపుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇం దుకై అటవీశాఖను ఉసిగొల్పుతున్నది. ఇప్పటికే పంటలను ధ్వంసం చేయడం, వ్యవ సాయ పరికరాలను స్వాధీనం చేసుకోవడం, భూముల చుట్టూ కంద కాలను తీయడం, పోడు చేసుకునే వారిపై కేసులుపెట్టి జైలుకు పంపిం చడం సాగిస్తున్నది. పోడుదారులపై సమరానికి సాయుధ పోలీసులను సైతం సిద్ధం చేస్తున్నది. ఈ పనులన్నీ సులువుగా చేసుకోవడానికి, కుట్రపూరిత పథకాలలో భాగంగా హరితహారం, పర్యావరణం, కోతు లబెడద లాంటి వాటిని అడ్డం పెట్టుకునే ప్రచారాన్ని ప్రారంభించింది.



పోడు భూములకు పట్టాలు ఇవ్వమని దశాబ్దాలుగా ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎత్తివేసిన దగ్గర నుంచి కమ్యూనిస్టు విప్లవకారుల నాయక త్వాన ఆదివాసులు ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళనలు చేస్తూనే ఉన్నా రు. ప్రతి ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప పోడు భూములకు పట్టాలు మాత్రం మంజూరు చేయలేదు. చివరికి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా పట్టాలు దక్కడం లేదు. అరకొరగా కొంత మందికి పట్టాలు ఇచ్చి మిగిలిన వారందరికీ పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులుపుకున్నది. అధికార యంత్రాం గం తప్పుడు పద్ధతుల వల్ల లక్షలాది ఎకరాలలో సాగు చేసుకుంటున్న పోడుదారులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా పట్టాలు లభించే పరిస్థితి కనిపించడం లేదు.



కాకతీయ రాజులకాలంలో అటవీ ప్రాంతంలో నిర్మించిన పాకాల, బయ్యారం లక్నవరం, రామప్ప, గణపురం వగైరా పెద్ద పెద్ద చెరువులు ఆదివాసుల ప్రయోజనాలకు కాకుండా గిరిజనేతరుల వ్యవసాయాలకు నెలవయ్యాయి. అందువల్లనే ఆదివాసులు తమ ప్రాంతాలు వదిలి అడ వి లోతట్టుకు పోవాల్సి వచ్చింది. అటవీ సరిహద్దుల భూములన్నీ గిరిజనేతరుల పాలైనాయి. దీంతో సహజవనరులతో బతికే ఆదివాసీ లకు జీవనాధారం దెబ్బతిన్నది. అడవి సంపదలు కోల్పోయి, వ్యవ సాయ భూములు కోల్పోయిన ఆదివాసీలకు పోడు వ్యవసాయమే జీవనాధారమైంది. అందువల్లనే గత్యంతరం లేక పట్టా హక్కులు లేకు న్నా దశాబ్దాల తరబడి పోడు భూమియే తమ జీవనాధారంగా వారు బతుకుతున్నారు.



ఇంతలోనే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆదివాసీల, ఇతర గిరిజనుల సంక్షేమమే తమ ధ్యేయమంటూనే కొత్త రాగాలు మొదలు పెట్టింది. దశాబ్దాలుగా పోడు భూములుగా ఉన్న వాటిలో తొలకరిలో 3 కోట్ల మొక్కలు నాటనున్నట్లు కొద్దికాలంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. మే నెలలో కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమా వేశంలో జులైలో 40 కోట్ల మొక్కలు నాటనున్నట్లు, వచ్చే ఏడాది 60 నుంచి 70 కోట్ల మొక్కలు నాటనున్నట్లు ప్రకటించారు. అటవీ అధికా రులకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు, భూఆక్రమణదారులపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. అంటే పొట్టకూటి కోసం పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులు కేసీఆర్ దృష్టిలో భూఆక్రమణదారులన్న మాట! వీరిని నిరంకుశ పీడీ చట్టం కింద జైలులో బంధిస్తాడన్నమాట! వీళ్ల పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకుంటున్న పొలాల్లో మొక్కలు నాటతారన్నమాట! జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ ఫారెస్టును మరో శేషాచలంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోందనిపిస్తోంది.



ఆదివాసీల పోడు భూములకు పట్టాహక్కులివ్వాలి

స్వతంత్రంగా బతకగలుగుతున్న పోడుదారుల భూములను కేసీఆర్ ప్రభుత్వం హరించడానికి కుట్ర చేస్తున్నది.  కేసీఆర్ ప్రభుత్వం 1 ఆఫ్ 70  చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అడవి విధ్వంసానికి పైన పేర్కొన్న ప్రధాన కారణాలను అదుపు చేయడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దేశ, విదేశాల కార్పొరేట్ శక్తులకు అడవిని, కొండల్ని మైనింగ్‌లకు ఇవ్వడాన్ని మానుకోవాలి. రిజర్వ్ ఫారెస్టును అభివృద్ధి చేయడానికి, పాడటానికి అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూనే ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శషబిషలు లేకుండా పట్టాలు ఇవ్వాలి.     



(నేడు హైదరాబాద్‌లో పోడు భూముల పరిరక్షణ వేదిక ధర్నా)

వ్యాసకర్త సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  మొబైల్: 98661 90514

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top