వరిలో జింక్‌ లోపం.. | Zinc deficiency in rice | Sakshi
Sakshi News home page

వరిలో జింక్‌ లోపం..

Jul 19 2016 5:07 PM | Updated on Mar 28 2019 5:12 PM

వరిలో జింక్‌ లోపం.. - Sakshi

వరిలో జింక్‌ లోపం..

కరువులో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాస్తోకూస్తో రైతులు అక్కడక్కడా వరి పంటలను వేసుకుంటున్నారు. వాటిని కాపాడుకోవాలంటే మెలుకువలు తప్పవని.. అవి పాటించకుంటే పంట పాడవడం ఖాయమంటున్నరు వ్యవసాయ శాఖ అధికారులు.

జాగ్రత్తలు తీసుకోకుంటే పంట నాశనమే
మెలుకువలు పాటిస్తే పంటకు చీడపీడలు దూరం
మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌


ఇబ్రహీంపట్నం రూరల్‌ : కరువులో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాస్తోకూస్తో రైతులు అక్కడక్కడా వరి పంటలను వేసుకుంటున్నారు. వాటిని కాపాడుకోవాలంటే మెలుకువలు తప్పవని.. అవి పాటించకుంటే పంట పాడవడం ఖాయమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. జింక్‌ లోపంతో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులు తప్పకుండా మెలుకువలు పాటిస్తే పంట దక్కుతుంది. వరిలో జింక్‌లోపం వల్ల కలిగే నష్టాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌ రైతులకు సూచించారు.
జింక్‌ సల్పేట్‌ లోపిస్తే వచ్చే లక్షణాలు
వరి ఆకుల పై నుంచి 3లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరు పక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నదిగా , పెళుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బి చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు
జాగ్రత్తలు ఇలా..
ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజ¯ŒSలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. లేదా పైరు పై జింక్‌ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి. జింక్‌ లోపం వల్ల దాదాపు 10 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. వ్యవసాయ శాఖ తరఫున సబ్సిడీపై జింక్‌ సల్ఫేట్‌ అందుబాటులో ఉంది. ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ వద్ద సుమారు 5టన్నుల జింక్‌ అందుబాటులో ఉంది. రైతులు సద్విని యో గం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌ కోరుతున్నారు.
పంటను కాపాడుకోవాలంటే జింక్‌ వేయాలి
 ప్రస్తుతం కరువులో వరిపంట వేసుకున్న రైతులు తప్పకుండా మెలుకువలు పాటించాలి. ఎప్పటికప్పుడు పంట ఏ రకంగా పెరుగుతుందో రైతు రోజూ పరిశీలించుకోవాలి. ఇటుక రంగుతో పైరు ఎర్రబారిన వెంటనే జింక్‌ వేసుకోవాలి . జింక్‌ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడువుతుంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుంటే మంచిది.
– శ్రవణ్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement