1.20 గంటల్లోనే.. | YSRCP MLA Roja stopped from attending Women's Parliament | Sakshi
Sakshi News home page

1.20 గంటల్లోనే..

Feb 12 2017 2:20 AM | Updated on Oct 29 2018 8:10 PM

వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ పోలీ సులు జులుం ప్రదర్శించారు. ఆమెను ప్రత్యేక బందోబస్తు నడుమ జిల్లా మీదు గా హైదరాబాద్‌కు 1.20 గంటల్లోనే తరలించారు.

చౌటుప్పల్‌/ దామరచర్ల : వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ పోలీ సులు జులుం ప్రదర్శించారు. ఆమెను ప్రత్యేక బందోబస్తు నడుమ జిల్లా మీదు గా హైదరాబాద్‌కు 1.20 గంటల్లోనే తరలించారు. శనివారం మహిళా పార్లమెంట్‌ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన రోజాను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశా రు. ఏపీలో వైఎస్సార్‌ సీపీ, ఇతర ప్రజా సంఘాల ఆందోళన నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఆమెను తరలించినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని ఇంటెలిజెన్స్‌ నివేదికల నేపథ్యంలో రోజా వాహనానికి వెనుకా ముందు మూడు వాహనాలతో పోలీసులు కాన్వాయిగా ఉండి అనుసరించారు.

ఆమె వాహనం వెనుక వస్తున్న ఏపీ మీడియా ప్రతినిధులను సరిహద్దు రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లి మం డలం వద్ద పోలీసులు నిలిపి వేశారు. స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదు. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద పాత్రికేయులను చూసిన రోజా కారును ఆపే ప్రయత్నం చేయగా.. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను నిలువరించారు. అంతకంటే ముందు టోల్‌ఫ్లాజా సమీపంలోనే ఎస్కార్ట్‌ వాహనాలు వేగాన్ని నియంత్రించకుండానే వెళ్లాయి.   పాత్రికేయులు  ఆపేందుకు అనుమతించాలని కోరినా వినిపించుకోలేదు.  ఎమ్మెల్యే బయటకు కన్పించకుండా ఇన్నోవాకు ఉన్న అద్దాలకు తెరలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement