చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు | ysrcp fires on chandra babu naidu government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు

Sep 24 2015 3:22 PM | Updated on Jun 1 2018 9:07 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు అనుమతి నిరాకరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ), అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు అనుమతి నిరాకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ), అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వీకే భవన్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు వారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ దీక్ష చేస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని  స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు సదాశివారెడ్డి, రమణారెడ్డి మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement