నన్నూరులో యువతి ఆత్మహత్య | young woman suicide | Sakshi
Sakshi News home page

నన్నూరులో యువతి ఆత్మహత్య

Jan 17 2017 12:02 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం నన్నూరు గ్రామంలో చోటు చేసుకొంది.

ఓర్వకల్లు (పాణ్యం): ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం నన్నూరు గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పింజరి పెద్దయ్య, మీరమ్మలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె రేష్మ అలియాస్‌ సలీమ (17) గ్రామంలోనే తొమ్మిదో తరగతి వరకు చదివింది. తండ్రి పెద్దయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో పిల్లల పోషణ తల్లిపై పడింది. ఈ క్రమంలో చదువు మానేసిన రేష్మ తల్లితోపాటు కూలీ పనులకు వెళ్లేది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొంది. ఇరుగు పొరుగు వారు పరిస్థితిని గమనించి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతామన్నారు. మృతికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కానున్నట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement